పాదాలపై ఆనె కాయలుచాలా మందిని వేధించే సమస్య ఇది.మృత కణాలు పేరుకుపోవడం, బాక్టీరియా, అధిక రాపిడి ఇలా రకరకాల కారణాల వల్ల పాదాలపై ఆనెలు ఏర్పడతాయి.
ఈ ఆనెలు బాధను కలిగించడమే కాదు నడిచే సమయంలో అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి.అందుకే వీటిని తగ్గించుకునేందుకు ఆయింట్‌మెంట్లు, లోషన్లు వాడుతుంటారు.
అయితే కొన్ని న్యాచులర్ టిప్స్ పాటిస్తేచాలా సులభంగా ఈ ఆనె కాయలను నివారించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా చూసేయండి.
ముందుగా కొన్ని తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో ఆముదం కలిపి ఈ మిశ్రమాన్ని ఆనెలు ఉన్న చోటు అప్లై చేయాలి.
ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి ఉదయాన్ని గోరు వెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా పాదాలపై ఉన్న ఆనె కాయలు తగ్గు ముఖం పడతాయి.
అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కలబంద కూడా ఆనె కాయలను నివారిస్తుంది.ముందు కలబంద నుంచి గుజ్జు తీసుకుని ఆనెలు ఉన్న ప్రాంతంలో బాగా పట్టించాలి.రెండు లేదా మూడు గంటల పాటు వదిలేసి ఆ తర్వాత చల్లటి నీటితో పాదాలకు శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఉల్లి కూడా పాదాలపై ఏర్పడిన ఆనెలకు చెక్ పెడతాయి.ముందు ఉల్లిపాయ నుంచి రసం తీసుకోవాలి.
ఇప్పుడు బకెట్ గోరు వెచ్చగా ఉండే నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ రసం వేసి కలపాలి.ఇప్పుడు ఈ నీటిలో పాదాలకు ఇరవై నిమిషాల పాటు ఉంచి.
ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా కూడా ఆనెలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
.