లేటు వయసులో ఈ ఆంటీ కి ఆఫర్లు బాగానే వస్తున్నాయట... కానీ..

తెలుగులో నూతన దర్శకుడు “నవీన్ మేడారం” దర్శకత్వం వహించిన “బాబు బాగా బిజీ” అనే చిత్రంలో కోరికలు తీరని ఆంటీ పాత్రలో నటించి  కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన టాలీవుడ్ ప్రముఖ నటి “సుప్రియ ఐసొలే” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో అమ్మడితోపాటు ప్రముఖ దర్శకుడు మరియు నటుడు శ్రీనివాస్ అవసరాల, శ్రీముఖి, తేజస్విని తదితరులు నటించినప్పటికీ ఎక్కువగా సుప్రియకే సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

 Telugu Heroine Supriya Aysola Movie Offers News-TeluguStop.com

గతంలో సుప్రియ పలు చిత్రాలలో మరియు లఘు చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది… కానీ అవేమీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్ గా ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కానీ ప్రస్తుతం సుప్రియకి టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు తలపు తడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే బాబు బాగా బిజీ చిత్రం ఎఫెక్ట్ తో కొందరు సినీ దర్శక నిర్మాతలు ఎక్కువగా బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలలో నటించే అవకాశాలను ఆఫర్ చేస్తున్నారట.అంతేకాక ఆ మధ్య ఈ అమ్మడికి పలు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు కూడా వరించినప్పటికీ తన సినిమా కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని సుప్రియ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

ఈ మధ్య  సుప్రియ  రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచినట్లు కొందరు నటీనటులు చర్చించుకుంటున్నారు.కాగా సుప్రియ ఓ చిత్రంలో నటించడానికి దాదాపుగా 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే సుప్రియ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో కూడా ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది.నటన పరంగా మంచి ప్రతిభ మరియు అనుభవం ఉన్నటువంటి సుప్రియ ఎందుకో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేక పోతోంది.

అయితే నటి సుప్రియకి దాదాపుగా 35 ఏళ్ల వయసు నిండడంతో హీరోయిన్ అవకాశాలు కరువయ్యాయి.దీంతో అప్పుడప్పుడు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా కనిపించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube