ఫోటో వైరల్: సరుకుల మధ్యలో శవాన్ని పెట్టి వ్యాపారం..!

ఇటీవల కాలంలో మానవత్వం మంటకలిసిపోయింది.కరోనా వైరస్ వచ్చాక పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది.

 Brazillian Super Market Manager Dies, Staff Covered His Dead Body By Umbrellas,-TeluguStop.com

ఇప్పుడు విషయం కరోనా వైరస్ ది కాదు.కానీ మానవత్వంకు సంబంధించిన విషయం ఇది.ఓ సూపర్ మార్కెట్ లో మ్యానేజర్ మృతి చెందితే కస్టమర్లు ఉన్న సమయంలో చనిపోయాడు అని తెలిస్తే వ్యాపారం ఆరోజు దెబ్బ తింటుంది అని శవాన్ని సరుకుల మధ్యలో పెట్టి వ్యాపారం చేసిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా మోయిసెస్ సంతోస్ అనే 59 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు.అయితే అతనికి ఉన్నట్టు ఉండి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చకుండానే స్టోర్ లోనే అత్యవసర చికిత్స అందించారు.

వారు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.అతడి ప్రాణం స్టోర్ లోనే గాల్లో కలిసిపోయింది.అయితే ఆ సమయంలో కస్టమర్లు బాగా వస్తుండటంతో అతడి శవాన్ని పెద్ద డబ్బాలు, సరుకులను అడ్డంగా పెట్టి గొడుగులతో స్టోర్ మధ్యలోనే దాచిపెట్టారు స్టోర్ మూయకుండా ఆరోజంతా వ్యాపారం చేశారు.

అయితే అది గమనించిన కొందరు సోషల్ మీడియాలో ఫోటో తీసి షేర్ చేశారు.దీంతో ఆ సూపర్ మార్కెట్ నిర్వాహకులపై ప్రజలు భారీ ఎత్తులో విమర్శలు చేశారు.

ఈ ఫోటోలు చూసిన మృత్యుడి భార్య స్పందిస్తూ.అసలు వీళ్లు మనుషులు కాదు.

డబ్బు సంపాదన ముఖ్యం కానీ మనిషి కాదు.వీళ్లకు మానవత్వం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో ఈ ఘటనపై విమర్శలు రావడంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఆమెకు క్షమాపణలు తెలిపారు.ఈ ఘటన తెలుసుకున్న నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube