రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఒకప్పుడు తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న “స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నందమూరి తారక రామారావు ఒక్క సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి ప్రజలకు “రామ రాజ్యం” అంటే ఏమిటో పరిచయం చేశాడు.
అయితే తాజాగా నందమూరి తారకరామారావు కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఆ ఫోటో ని పరిశీలించినట్లయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి ఓ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలకి విచ్చేసిన నందమూరి తారక రామారావుతో చిరంజీవి కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ ఫోటోని ఇటు నందమూరి అభిమానులు, మెగా అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.
అంతేగాక “నట సార్వభౌముడితో టాలీవుడ్ మెగాస్టార్” అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఇవి ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా చిత్రీకరణ పనులు దాదాపుగా 40 శాతం పూర్తయినట్లు సమాచారం.కాగా ఇటీవలే చిరంజీవి మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.