తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి “టెంపర్” అనే చిత్రం అప్పట్లో ఎంత మంచి విజయం సాధించిందో ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, సోని అగర్వాల్ (గెస్ట్ అప్పీయరెన్సు), పవిత్ర లోకేష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రంలో నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి ఎంతగా ఆకట్టుకున్నాడో మనందరికీ బాగా తెలుసు. ఈ చిత్రంలో ముందుగా కానిస్టేబుల్ పాత్రలో టాలీవుడ్ ప్రముఖ విలక్షణ నటుడు ఆర్.
నారాయణమూర్తి ని నటింప జేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ అనుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల అది సాధ్య పడలేదు.
అయితే తాజాగా ఈ విషయంపై నటుడు ఆర్.నారాయణ మూర్తి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగా తనకు టెంపర్ సినిమా లోని కానిస్టేబుల్ పాత్రను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనని కానీ ఆ చిత్రం కమర్షియల్ తరహాలో ఉండటం వల్ల తాను నటించ లేదని స్పష్టం చేశాడు.
ఈ చిత్రంలో లో పోసాని కృష్ణ మురళి కానిస్టేబుల్ పాత్రకి దాదాపుగా వందకి 100% న్యాయం చేశాడు.కానీ ఆర్.నారాయణమూర్తి ఆ పాత్రలో నటించే ఉంటే మాత్రం ఈ చిత్రానికి మరింత అట్రాక్షన్ ఉండేదని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఫైటర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చినట్లు సమాచారం.