ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి 'వివో' అవుట్...!

ఈ సంవత్సరం మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే తాజాగా మార్చ్ నెలలో మొదలవ్వాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది.

 Ipl 2020, Vivo, Sponser Ship, Bcci, Ipl, China, India, Vivo To Pull Out Of Ipl 2-TeluguStop.com

దీంతో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ సీజన్ ను యూఏఈ దేశంలో జరపాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నిర్ణయించారు.అయితే గత నెలలో భారత్ – చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికులు 20 మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ చైనా కు సంబంధించిన 59 యాప్స్ భారత ప్రజల సమాచారానికి భంగం కలిగించేలా ఉన్నాయన్న నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.అయితే 2018 నుండి చైనా దేశానికి సంబంధించిన మొబైల్ రంగ సంస్థ వివో భారతదేశంలో జరిగే ఐపీఎల్ కు ఐదు సంవత్సరాలకు గాను ఏకంగా రూ.2199 కోట్లను కాంట్రాక్టుగా నియమించుకుంది.అయితే భారత సైన్యంతో జరిగిన గొడవల కారణంగా భారతదేశంలో ‘బాయ్ కాట్ చైనా’ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కూడా రద్దు చేయాలని బిసిసిఐకి అనేకమంది అభిమానులు విజ్ఞప్తి చేశారు.

తాజాగా భారతదేశ క్రికెట్ కౌన్సిల్, ఐపీఎల్ నియామక మండలి నిర్వహించిన సమావేశంలో వివో ను స్పాన్సర్ షిప్ కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో వివో కంపెనీ తనంతట తానే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది.దీంతో ఐపీఎల్ నుండి వివో నిష్క్రమించి నట్లయింది.

ఇక ఐపీఎల్ 2020 సీజన్ నడిపేందుకు మరో స్పాన్సర్ ను వెతికే క్రమంలో పడింది బీసీసీఐ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube