కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే.దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతూ ఉన్నాయి.
ఎంతో మంది ప్రజలు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు వదులుతున్నారు.కొన్ని దేశాల్లో అయితే రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది.
అయితే కరోనా కు సంబంధించి జరుగుతున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతున్న విషయం తెలిసిందే.కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లో కరోనా సోకితే యువకులకు ఏమీ కాదని రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా వైరస్ భారీ నుండి యువకులు కోలుకుంటారు అని ఓ పరిశోధనలో తేలింది.
కానీ ఆ తర్వాత దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధులతో పాటు యువకులకు కూడా కరోనా వైరస్ ముప్పు ఉందంటూ తెలిపిన విషయం తెలిసిందే.వృద్దులపై కరోనా ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతుందో యువకులపై కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపుతుందని తెలిపింది.
తాజాగా మరోసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్… ఈ విషయాన్ని స్పష్టం చేశారు,
కరోనా వైరస్ తో వృద్ధులకు ఎంత తీవ్రంగా ముప్పు ఉందో యువతకు కూడా అదే స్థాయిలో ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు, కరోనా వైరస్ బారిన పడిన యువకులు రెండు మూడు వారాల పాటు ఆస్పత్రి పాలు అవడమే కాక కొన్ని కొన్ని సార్లు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.అంతే కాకుండా యువకుల నుంచి మరొకరికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు.
అందుకే యువకులు కూడా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు అంటూ సూచించారు