ఈ మధ్య కాలంలో దాఖలైన వివిధ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది.ఆయా అంశాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
బక్రీద్ పండుగలో జంతువుల వధపై.ఒంటెల అక్రమ రవాణా, వధించడంపై డాక్టర్ శశికళ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా జంతువులను తరలించి వధిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు నిచ్చింది.దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేశామని ప్రభుత్వం వెల్లించింది.
నిలోఫర్ ఆస్పత్రిలో భోజన సరఫరా కాంట్రాక్టర్ పై.నిలోఫర్ ఆస్పత్రిలో ఓ కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది.నిలోఫర్ ఆస్పత్రిలో భోజన సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పై ఎందుకంత ప్రేమను కురిపిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.విచారణ కమిటీ నివేదిక ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ స్పందించకోవడంతో ఉద్దేశం ఏంటని అడిగారు.
కాంట్రాక్టర్ సురేశ్ ను అంతలా వెనకేసుకు రావడానికి కారణం ఏంటన్నారు.త్వరలో నివేదికపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్టర్ సురేష్ కుమార్ పని తీరును అధికారులు పరిశీలించాలన్నారు.ఆగస్టు 17 లోపు నివేదికను సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.