తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ తో ఆహ ఓటీటీ యాప్ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.ఈ చానల్ ద్వారా అల్లు అరవింద్ డిఫరెంట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.దీంతో లాక్ డౌన్ పీరియడ్ లో ఆహ చానల్ కి ఫాలోయింగ్ పెరిగింది.
తెలుగు వెబ్ సిరీస్ లు కోరుకునే వారు ఆహని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇందులో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు.
తాజాగా రుద్రవీణ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు.ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పటికి అందులో చిరంజీవి నటన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో జెమిని గణేషన్ చిరంజీవి తండ్రి పాత్రలో నటించాడు.
ఇప్పటికి టీవీలలో ఆ సినిమా వచ్చిందంటే జనాలు ఆసక్తిగా చూస్తారు.ఇప్పుడు ఈ టైటిల్ తో అల్లు అరవింద్ ఓ లేడీ ఒరియాంటెడ్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు.
ఈ వెబ్ సిరీస్ ని అదిరిపోయే కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనిని అల్లు అరవింద్ స్వయంగా నిర్మించడం విశేషం.ఇక కథ ప్రకారమే దానికి రుద్రవీణ టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకుంటుందని, త్వరలో ప్రచారం కాబోతున్నట్లు బోగట్టా.
మరి చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి కథ చెబుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.