మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న వైష్ణవ్ తేజ్‌కు ఆరంభమే కరోనా దెబ్బ పడినది.ఉప్పెన సినిమా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవ్వాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడినది.
ఆ సినిమా ఎప్పటికి విడుదల అయ్యేది చెప్పలేని పరిస్థితి.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఆ సినిమాకు సంబంధించిన విడుదల విషయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.
మొదట ఉప్పెనను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అవ్వడంతో ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేయలని నిర్మాతలు భావిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు మైత్రి వారు ఆగనున్నారు.ఇక ఇదే సమయంలో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాకు సంబంధించిన ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది.
ఈ ఏడాది చివర్లో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా పట్టాలెక్కబోతుంది అనేది ఆ వార్తల సారాంశం.
ఉప్పెన విడుదల కాకుండానే రెండవ సినిమా అంటూ వస్తున్న వార్తలపై మెగా కాంపౌండ్ స్పందించింది.
అలాంటిది ఏమీ లేదని, ఉప్పెన విడుదలైన తర్వాతే రెండవ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.రెండవ సినిమాకు సంబంధించి ఇంకా కథను కూడా ఫైనల్ చేయలేదని, ఉప్పెన ఫలితాన్ని బట్టి స్టోరీని ఫైనల్ చేస్తాడని తెలుస్తోంది.
ఉప్పెన ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.