ఆ ఒక్క డైలాగ్ తన సినీ జీవితాన్నే మార్చేసిందంటున్న సింగర్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించినటువంటి “కుమారి 21ఎఫ్” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి పాత్రలో నటించిన సింగర్ మరియు నటుడు గురించి నోయెల్ సీన్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ఇతడు ఒక పక్క సినీ పరిశ్రమలో పాటలు పాడుతూనే మరోపక్క సినిమాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Noel Sean, Singer Cum Actor, Movie Acting Offers News, Tollywood, Kumari 21 F Mo-TeluguStop.com

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో నోయెల్ సీన్ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తాను సింగర్ నుంచి యాక్టర్ గా ఎలా మారాడో వివరించాడు.

అయితే అప్పట్లో తాను సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో పలు రకాల చిత్రాలకి ఆడిషన్లు ఇచ్చానని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో కుమారి 21ఎఫ్ చిత్రం కోసం ఆడిషన్ కి వెళ్లాలని ఆ సమయంలో నేను చెప్పినటువంటి “నా పేరు సీన్… వద్దు నీ పేరు చెప్పొద్దు, నేనే నాకు నచ్చింది పెట్టుకుంటా”  అంటూ చెప్పే డైలాగ్ నచ్చడంతో వెంటనే ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనని ఈ చిత్రంలో హీరో స్నేహితుడి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారని, ఆ చిత్రం తర్వాత తాను నటనలో పలు మెరుగులు దిద్దుకుంటూ వరుస చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్ననాని కూడా తెలిపాడు.

అయితే కుమారి 21ఎఫ్ చిత్రంలో నోయెల్ సీన్ నటనకు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

అయితే తెలుగులో ఈ మధ్యకాలంలో నోయెల్ సీన్ రంగస్థలం, విజేత, హలో గురు ప్రేమకోసమే, పడి పడి లేచే మనసు, తదితర చిత్రాల్లో నటించాడు.

అయితే సింగర్ గా నోయెల్ సీన్ పాడిన టువంటి “బహాకిలికి” అనే ప్రైవేట్ ఆల్బమ్ మంచి హిట్ అయ్యింది.దీంతో ప్రస్తుతం నోయెల్ సీన్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సింగింగ్ లో కూడా తన ప్రతిభను కనబరుస్తూ దూసుకుపోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube