కరోనా మహమ్మారితో దగ్గర ఉండి పోరాటం చేస్తున్న వైధ్యులు ఇంకా సిస్టర్స్ ఇతర వైధ్య సిబ్బంది కోసం కేంద్ర ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.కరోనాకు ప్రస్తుతం వ్యాక్సిన్ లేని ఈ సమయంలో అంతా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్న విషయం తెల్సిందే.
అందుకే వైధ్య సిబ్బంది అందరికి కూడా ఈ మాత్రలను అందించాలని నిర్ణయించింది.ముందస్తుగా వారికి ఈ ట్యాబెట్లను ఇవ్వాలని ఎయిమ్స్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
డాక్టర్లు, నర్సులు ఇంకా వైధ్య అధికారులు తమకు అవసరం ఉన్నంతగా ఈ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.ఏ విభాగంకు ఎన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కావాలనే విషయాన్ని నివేదించాలంటూ ఎయిమ్స్ ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రస్తుతం హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబెట్లు ఇండియాలో కావాల్సినన్ని ఉన్నాయని ఏ ఒక్కరు ఆందోళన చెందక్కర్లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.ఇప్పటికే విదేశాలకు ఈ ట్యాబ్లెట్ల ఎగుమతి నిలిపేయడం జరిగింది.