తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తూనే ఉంది.పాజిటివ్ కేసులను ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలో పాజిటివ్ కేసులు పెరిగితే గాంధీ హాస్పిటల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే ముందస్తు ప్రణాళిక ప్రకారం 1500 పడకల కోవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.గచ్చిబౌలిలో ఉన్న ఇండోర్ స్టేడియంకు చెందిన భవనంను ఇందుకు ఉపయోగిస్తున్నారు.
గత వారం పది రోజులుగా ఆ భవనంను హాస్పిటల్‌గా మార్చేందుకు శరవేగంగా కసరత్తు జరుగుతోంది.నేడు మంత్రి కేటీఆర్ కూడా ఈ హాస్పిటల్‌ను పరిశీలించారు.ముందస్తు ఏర్పాట్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి వరకు పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నట్లుగా ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది.గచ్చిబౌలిలో నిరుపయోగంగా ఉన్న ఈ భవనంను కోవిడ్ హాస్పిటల్‌గా మార్చడంపై రాజకీయ వర్గాల్లో కూడా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలోనే కేసుల సంఖ్య పెరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.