ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇప్పటికే ఇటలీ దేశం తాము ఈ కరోనా వైరస్ ని అదుపు చేయలేమంటూ చేతులెత్తేసిన సంగతి విదితమే.
మరి కొన్ని దేశాల్లో అయితే ఒకపక్క ఈ కరోనా వైరస్ నాశనం చేసేందుకు మందును కనిపెట్టే పనుల్లో బిజీగా ఉంటే మఇంకొన్ని దేశాలు మాత్రం అసలు కరోనా వైరస్ ని రాకుండా నియంత్రించే చర్యలు చేపట్టాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే మన దేశంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని విధించారు.
అంతేగాక ఇటీవలే ఈ లాక్ డౌన్ ని ఏప్రిల్ 14వ తారీకు వరకు పొడిగించారు కూడా.దీంతో ప్రజలకు అత్యవసర సదుపాయాలు అయినటువంటి మెడికల్ షాపులు, నిత్యావసర సరుకుల దుకాణాలు మరియు మరికొన్ని సంబంధిత సదుపాయాలు తప్ప మిగిలిన అన్ని సర్వీసులను మూసివేశారు.
అయితే ఈ మూసివేసిన వాటిలో వైన్ షాప్ సర్వీస్ ఒకటి.ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వైన్ షాపుల ను ఒక్కసారిగా మూసివేయడంతో మందుబాబులు మద్యం దొరక్క అల్లాడిపోతున్నారు.
అంతేగాక ఇలా చెప్పాపెట్టకుండా మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయడం పై ఇప్పటికే కొందరు మందుబాబులు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో కనీసం రోజుకి రెండు గంటల సమయం పాటు లైసెన్స్ కలిగినటువంటి మద్యం దుకాణాలను తెరవాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.అయితే వైద్యులు కూడా తరచూ మద్యం సేవించే వాళ్ళు ఇలా ఉన్నట్లుండి ఒక్కసారిగా మానేస్తే పలు ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయని కూడా ఇప్పటికే పలు అధ్యయనాలలో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఎలాగైనా మందుబాబులపై దయుంచి ప్రభుత్వ అధికారులు మద్యం దుకాణాలను తెరవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.