ప్రస్తుతం ప్రపంచ దేశాలని కరోనా వైరస్ తో వచ్చే కోవిడ్ వ్యాధి ఎంత భయపెడుతుందో అందరికి తెలిసిందే.అన్ని దేశాలు ఈ వైరస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు.
ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఈ కోవిడ్ కారణంగా తేబ్బతింది.అయితే ఈ వైరస్ లు మనుషులకి ఎంత ప్రమాదం చేస్తాయో అంతే ప్రమాదం సైబర్ వైరస్ లు కూడా చేస్తాయి.
ఇప్పుడు ప్రపంచ అంతా టెక్నాలజీ మీద నడుస్తుంది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
అయితే వారికి సంబందించిన సమాచారం, ఆర్ధిక లావాదేవీలు అన్ని కూడా కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ప్రజలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ లని టార్గెట్ చేసుకొని సైబర్ దొంగలు, డేటా దొంగతనం చేయడం, మన వ్యక్తగత సమాచారం తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేయడం, మనకి తెలియకుండానే మన ఎకౌంటు నుంచి డబ్బులు దొంగతనం చేసేయడం చేస్తున్నారు.
మనకు తెలియకుండా డైలీ వచ్చే మెసేజ్ లలో కొన్నింటిని క్లిక్ చేసినపుడు ఫోన్ లోకి వచ్చే కంప్యూటర్ వైరస్ కారణంగా మన డేటా మొత్తం హ్యాక్ అవుతుంది.దాంతో సైబర్ మోసగాళ్ళు దారుణాలకి పాల్పడుతూ ఉంటారు.
ఇప్పుడు ఈ కోవిడ్ పేరుతో కూడా అలాంటి మలవేర్ లని స్ప్రెడ్ చేసే డొమైన్స్ అందుబాటులోకి వచ్చాయి.చెక్ పాయింట్ ప్రూఫ్ పాయింట్ అనే రెండు సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఈ విషయాన్ని గుర్తించాయి.
కోవిడ్, కరోనా వైరస్ పేరుతో వచ్చే మెసేజ్ పై అప్రమత్తంగా ఉండాలని, వాటికి సంబందించిన సమాచారం అనుకోని క్లిక్ చేస్తే సైబర్ మోసగాళ్ళకి టార్గెట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.