నిర్భయ కేసుకు సంబంధించి ఆ నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్షలు ఖరారు చేస్తూ ఇటీవల పాటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఆ దోషులు నలుగురి కి దోషులకు తిహార్ జైలు అధికారులు చివరిసారిగా లేఖ రాశారు.
నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్ సింగ్‌లు చివరిసారిగా తమ కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతిస్తామని తిహార్ జైలు అధికారులు తమ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో తమ కుటుంబసభ్యులను కలవడానికి వారు సుముఖత చూపినట్లు తెలుస్తుంది.
అయితే దోషుల్లో ముఖేష్,పవన్ లు మాత్రం కుటుంబ సభ్యులను గత తీర్పు ఫిబ్రవరి 1 వ తేదీన డేట్ వారెంట్ జారీకి ముందు కుటుంబసభ్యురాలను కలిశామని అధికారులకు స్పష్టం చేయగా,అక్షయ్,వినయ్ లు మాత్రం కుటుంబసభ్యులను కలుస్తామని అధికారులకు తెలిపినట్లు తెలుస్తుంది.అయితే సాధారణంగా దోషులను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీ ద్వారానే వారితో మాట్లాడానికి అవకాశం ఇచ్చేవారు.
అయితే ఉరిశిక్షకు ముందు మాత్రం చివరి సారి కాబట్టి ములాఖత్ అనేది దోషులకు, వారి కుటుంబసభ్యులకు కల్పిస్తారు.ములాఖత్ అంటే కుటుంబ సభ్యులను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం అన్నమాట.
2012 లో దేశరాజధాని ఢిల్లీ లో బస్సులోనే నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన దారుణ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష అమలు తేదీలను పాటియాలా ట్రయల్ కోర్టు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఖరారు చేయగా అధికారులు దానికి తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇటీవల దోషుల్లో ఒకరైన వినయ్ తన తలను గోడకు కొట్టుకున్న నేపథ్యంలో జైలు అధికారులు పకడ్బందీ గా భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.