ప్రపంచ దేశాల్లోని ఇస్లాం దేశమైనటువంటి పాకిస్తాన్ దేశంలో హిందువులకు రోజురోజుకి రక్షణ కరువవుతోంది.తాజాగా ఓ హిందూ యువతిని ఓ ముస్లిం యువకుడు పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న ఘటన సింధ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో కిషోర్ దాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.అయితే ఇదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి హిందూ సంప్రదాయానికి చెందిన ఓ యువకుడితో కిషోర్ దాస్ తన కూతురు వివాహం నిశ్చయం చేశాడు.
ఇందులో భాగంగా నిన్నటి రోజున పెళ్లి జరుగుతుండగా ఇదే ప్రాంతానికి చెందిన టువంటి ఓ ముస్లిం యువకుడు ఆ నవ వధువును పోలీసుల సాయంతో ఎత్తుకెళ్లి బలవంతంగా మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు.అయితే ఇందుకు ఆధారంగా పెళ్లి జరిగినట్లు పత్రాలను కూడా సృష్టించాడు.
దీంతో తమ కన్న కూతుర్ని ఇలా పెళ్లి పీటల పైనుంచి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకో వడం సమంజసం కాదని అంతే కాక ఇష్టం లేకుండా ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం పోలీసులు కూడా సమర్థిస్తున్నారని వాపోతున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా పాకిస్థాన్ లో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాదు.ఇప్పటికే పలుమార్లు హిందూ మరియు సిక్కు యువతులను స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం యువకులు బలవంతంగా అపహరించి వారిచేత బలవంతంగా మతం మార్పించి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు కోకొల్లలు.దీంతో పాకిస్థాన్ దేశంలో నివాసముంటున్న మైనారిటీలు తీవ్ర బ్రాంతులకు గురవుతున్నారు.
అంతేకాక రోజురోజుకి పాకిస్థాన్ లో నివసిస్తున్నటువంటి మైనారిటీలకు రక్షణ కరువవుతోందని దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు.మరి కొందరు ప్రజా సంఘాల నాయకులు దేశంలో మైనార్టీలకి భద్రత కలిపిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినప్పటికీ అవన్నీ కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పాకిస్థాన్ దేశంలోని జీవనం సాగిస్తున్న మైనారిటీల పరిస్థితి చాల దయనీయంగా ఉందని కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రధాని మంత్రి స్పందించి వారికీ తగిన భద్రత కల్పించాలని కోరుతున్నారు.