పెళ్లిపీటలపై గర్భవతి అయిన వధువు.. బిత్తరపోయిన వరుడు

పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య నూతన జీవితాన్ని మొదలుపెట్టేందుకు వరుడు, వధువు పసుపు బట్టలతో పెళ్లిపీటలపై కూర్చున్నారు.ఇంతలో జరిగిన ఓ సంఘటన ఆ జంటతో పాటు అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది.

 Bride Gets Pregnant On Wedding-TeluguStop.com

బీర్బుమ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో వధువు కళ్లు తిరిగి పడిపోయింది.

దీంతో అక్కడున్న వ్యక్తుల్తో ఓ డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించాడు.

ఆమె అయిదు నెలల గర్భవతి అని తేల్చిచెప్పాడు.ఇది విన్న వరుడు, అతడి కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులు నోరెళ్లబెట్టారు.

తాళి కట్టిన తన భార్యతో కొత్త జీవితాన్ని ఊహించుకున్న ఆ వరుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు.బిత్తరచూపులు చూడటం తప్ప అతడి నోటమాట రాలేదు.

ఆ వధువు గర్భం రావడానికి ఆమె స్నేహితుడొకడు కారణం అని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది.

అంతే, ఒక్కసారిగా వరుడు తరఫు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

పెళ్లికూతురి తరఫువారు మోసం చేసిన ఆ ప్రబుద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాపం ఆ వరుడు మాత్రం పిచ్చిచూపులు చూస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube