బీజేపీ విషయంలో టీఆర్ఎస్ మనసు మార్చుకుందా ?

తెలంగాణ బీజేపీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ మొన్నటివరకు అమీ తుమీ అన్నట్టుగా వ్యవహరించింది.తెలంగాణాలో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికే బీజేపీ ఎత్తుగడలు వేస్తుందని, బీజేపీ ఇక్కడ బలపడితే రాబోయే రోజుల్లో తమకు ఇబ్బందేనని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం ఆ పార్టీ పై విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

 Telangana Bjp Focuson Trsgovernament-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉండడంతో పాటు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీ విషయంలో వైరం పెట్టుకునే కంటే సానుకూలంగానే ముందుకు వెళ్తే బెటర్ అన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుంటూ టీఆర్ఎస్ ను బలహీనపర్చడమే ఉద్దేశంగా బీజేపీ నేతలు నడుచుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అలెర్ట్ అయ్యినట్టు కనిపిస్తోంది.

-Telugu Political News

బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే అన్నట్టు గా తెలంగాణాలో నిర్మితం అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ వేస్తున్న అడుగులు దీనికి బలం చేకూర్చుతున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారెజ్ లో పంపు హౌజులకు దేవతలపేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.మేడిగడ్డ బ్యారేజ్ కి లక్ష్మి బ్యారేజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌస్ గా పేరు పెట్టారు.అలాగే అన్నారం బ్యారేజికి సరస్వతి బ్యారేజ్ గా, సిరిపురం పంప్ హౌస్ కు సరస్వతి పంపు హౌస్ గా నామకరణం చేశారు.

సుందిళ్ల బ్యారేజ్ కు పార్వతి బ్యారేజ్ గా గోలివాడ పంపుహౌస్ కు పార్వతి పంపుహౌస్ గా పేరుపెట్టారు.అలాగే నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌస్ కు నంది పేరు ఖరారు చేశారు.

లక్ష్మిపురం పంపుహౌస్ కు గాయత్రి పంప్ హౌస్ గా పేరుపెట్టారు.

-Telugu Political News

అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సైతం బీజేపీ మీద సెటైర్లు వేస్తున్నారు.దేశంలో మతం రాజకీయం జాతీయవాదం పరస్పరం విడదీయలేనంతగా అల్లుకుపోయాయని, మతాన్ని రాజకీయాన్ని ఏకం చేయాలనుకోవడంవల్లే అనేక ప్రమాదాలు వస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.నాతో ఉంటే దేశభక్తుడివి లేకుంటే నీవు దేశద్రోహివి అనే ధోరణి దేశంలో పెరిగిపోతోందని పరోక్షంగా బీజేపీని కామెంట్ చేశారు.

ఇది ఇలా ఉంటే తెలంగాణాలో తమతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నఎంఐఎం పార్టీతో బహిరంగ దోస్తీ చేయడానికి టీఆర్ఎస్ ఇష్టపడడంలేదు.దీనికి కారణం బీజేపీనే అని తెలుస్తోంది.

ఎందుకంటే ఎంఐఎం తో ఎక్కువగా కలిసి ఉండడం బీజేపీ కి ఆగ్రహం తెప్పిస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో వైరం మంచిది కాదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా దూరం పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube