శ్రీరెడ్డి పోరాటంకి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

ఆ మధ్య టాలీవుడ్ లో నటి శ్రీ రెడ్డి ఇష్యూ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.టాలీవుడ్ లో ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీడియా ముందుకి వచ్చిన శ్రీ రెడ్డికి మహిళా సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది.

 Telangana Government Pass The Bill To The Opponent Panel For Casting Couch-TeluguStop.com

అయితే తరువాత ఆ శ్రీ రెడ్డి ఇష్యూ రాజకీయ రంగు పులుముకోవడంతో మహిళా సంఘాలు, అలాగే ఆమెకి అండగా నిలబడ్డ జూనియర్ ఆర్టిస్ట్స్ అందరూ వెనక్కి తగ్గిపోయారు.అయితే మహిళా సంఘాలు మాత్రలు టాలీవుడ్ లో లైంగిక వేదింపుల ఘటనలు జరగకుండా విమెన్ ప్యానల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడంతో పాటు పిటీషన్ కూడా వేసారు.

అప్పట్లో శ్రీరెడ్డికి మద్దతుగా మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను ఇన్నాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుంది.టాలీవుడ్ లో మహిళల రక్షణ కోసం ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ విడుదల చేసింది.

ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది.అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube