షార్జా లో నిస్సహాయ స్థితిలో పశ్చిమ వాసి

పశ్చిమ గోదావరి జిల్లా మండలంలోని గొల్లలకేడేరు గ్రామానికి చెందిన ఓ మతి స్థితిమితం లేని ఒక వ్యక్తి షార్జాలో మతిస్థిమితం కోల్పయి అక్కడ ఆసుప్రతిలో చికిత్స పొదుతున్నారు.అయితే అతడి ఆచూకి తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 Indian Nri Found In Sharjah In Unconscious-TeluguStop.com

అతడి గురించి తెలుసుకోవడానికి భారతీయ అధికారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.అయితే అతడి జేబూలో దొరికిన ఆధారాలని బట్టి అతడు ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మాత్రం గుర్తించగలిగారు.

వివరాలలోకి వెళ్తే.

అయితే మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నా అతడిపేరు పాలా విజయ.అతడికి 41 ఏళ్ళు ఉండగా కొద్ది నెలల క్రితం అంబులెన్సు షార్జాలోని ఒక ఆసుపత్రికి తీసుకోవచ్చింది.చికిత్స చేసిన వైద్యులు అతని నరాల వ్యవస్థ దెబ్బతిందని…అతడు పూర్తిగా తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడని తెలుపారు.

అతడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని ఎలా విడిచి పెట్టాలా అనే ఆలోచన చేస్తున్నారు.

ఇదిలాఉంటే 2015లో దుబాయ్‌కు వచ్చిన విజయ రెండేళ్ల తరువాత 2017లో స్వదేశానికి తిరిగి వెళ్లడానికి విమాన టిక్కెటు కొనుగోలు చేసినట్లుగా కొన్ని చీటీల ద్వారా తెలుస్తోందని అయితే వాటిలో ఒక చీటీపై 7032009167 ఫోన్ నంబర్‌, పాలా సత్యనారాయయణ అని రాసి ఉంది.

ప్రవాసాంధ్ర సామాజిక కార్యకర్తలు ముక్కు తులసి కుమార్(00971582435489), ఖాదర్ భాష (00917504227865) ఇతడి ఆచూకి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube