బిగ్ బాస్ భానుశ్రీ ని లవ్ చేసి మోసం చేసింది ఎవరో తెలుసా.? ఆ టైం లో అండగా నిలిచింది.!

36 ఎపిసోడ్‌ల తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది “భానుశ్రీ”.‘బాహుబలి 2’ చిత్రంలో తమన్నాకు కొన్ని సీన్లలో డూప్‌గా నటించి తనదైన శైలి శరీర ఆకృతితో అందాల అవంతికలా మాయ చేసింది భానుశ్రీ.

 Big Boss Bhanu Sri Revalves Hero Life Secrets-TeluguStop.com

‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్యలో 18’, ‘కుమారి 21F’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా మంచి డాన్సర్‌గా కూడా పేరు సంపాదించింది బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టింది భాను.

కాకపోతే ఆమె చివర్లో కౌశల్ పై నిందలు వేయడంతో అందరు ఆమెను నెగటివ్ గా చూసారు.

ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే.టీవీ ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ అనుభవాలతో పాటు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు భాను శ్రీ.

“నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం.నటిగా రాణించాలనే ఆసక్తి ఉండేది.ప్రోత్సాహం అయితే లేదు.నేను ఊరిలో ఉన్నప్పుడు పెద్దగా ఎవరూ గౌరవించేవారు కాదు.దీంతో యాక్టింగ్, డాన్స్ మీద ఉన్న ఇష్టంతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను.నా వద్ద ఉన్న కొంచెం డబ్బుతో డాన్స్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను, కాని అక్కడ ఎదురైన అవమానాలు, ఆర్థిక పరమైన ఇబ్బదులతో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

నేను డాన్స్‌ నేర్చుకోవడం, నటి కావడం నా పేరెంట్స్‌కి ఇష్టం లేకపోవడంతో కనీసం నా కోసం మా పేరెంట్స్ వచ్చేవాళ్లు కాదు.అప్పుడప్పుడూ మా అమ్మమ్మ తాతయ్యలు మాత్రమే వచ్చేవాళ్లు.

అలా తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయా.ఆ టైంలోనే ప్రాణంగా ప్రేమించిన వాడు కూడా దూరమయ్యాడు.” అంటూ చెప్పుకొచ్చారు భానుశ్రీ.

జీవితంలో అందర్నీ పోగొట్టుకున్నఆమె ఒంటిరిగానే ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ముందుకు సాగింది.

చివరికి విజయం సాధించింది.ఆ విజయం వెనుక ఓ వ్యక్తి ఉన్నారంట.

కష్ట సమయంలో ఆమెకు తోడుగా అండగా నిలిచింది శంకర్ రెడ్డి అనే వ్యక్తి.అనుక్షణం ఆమెకు నీడగా ఉంటూ ఎంతో ప్రోత్సహించారు ఈ విజయం అతడిదే అంటూ ‘ఐ లవ్ యు శివ శంకర్ రెడ్డి’ అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని తన ప్రేమను వ్యక్త పరిచింది భాను.

మరి భాను శ్రీ – శివ శంకర్ రెడ్డి పదేళ్ల పవిత్ర ప్రేమ ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube