తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన విశాల్‌.. శ్రీరెడ్డితో డైరెక్ట్‌ ఫైట్‌

శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌కు మారిపోయింది.తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

 Hero Vishay Ready To Fight With Sri Reddy-TeluguStop.com

అయినా కూడా ఏ ఒక్కరు పెద్దగా పట్టించుకోలేదు, ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన వారు శ్రీరెడ్డిపై విమర్శలు చేసేందుకు సాహసం చేయలేదు.అయితే తమిళ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఉండదు.

తమ వారికి ఎవరైనా ఏమైనా అంటే వెంటనే స్పందించేందుకు విశాల్‌తో పాటు మరికొందరు ఎప్పుడు సిద్దంగా ఉంటారు.తాజాగా శ్రీరెడ్డి తమిళ ప్రముఖులపై విమర్శలు చేసిన నేపథ్యంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడు అయిన విశాల్‌ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం అవుతున్నాడు.

తమిళ దర్శకుడు మురుగదాస్‌, హీరో శ్రీకాంత్‌ ఇంకా దర్శకుడు లారెన్స్‌పై తీవ్ర స్థాయిలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ ముగ్గురు స్పందించాల్సిందే అంటూ టీ రాజేందర్‌ మీడియా ముందుకు వచ్చి డిమాండ్‌ చేశాడు.

మీ ముగ్గురి వల్ల తమిళ సినిమా పరిశ్రమ పరువు పోకూడదు అని, అందుకే మీరు వెంటనే ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ ఆయన డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కావద్దనే ఉద్దేశ్యంతో రంగంలోకి విశాల్‌ దిగినట్లుగా తెలుస్తోంది.

తమిళ సినిమా పరిశ్రమపై ఎప్పటికప్పుడు వచ్చే విమర్శలను తన సొంత విషయంగా భావించి స్పందించే విశాల్‌ తాజాగా శ్రీరెడ్డి విషయంలో కూడా సీరియస్‌గా స్పందించేందుకు సిద్దం అవుతున్నాడు.మొదట శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన ఆ ముగ్గురితో విశాల్‌ మాట్లాడనున్నారు.ఆ ముగ్గురితో మాట్లాడిన తర్వాత శ్రీరెడ్డి విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు.

తాజాగా శ్రీరెడ్డి చెన్నై చేరుకుంది.ఆమె మూడు రోజుల పాటు అక్కడే ఉంటుందట.

శ్రీరెడ్డి చెన్నైలో ఉన్న సమయంలోనే విశాల్‌ ఈ విషయమై ఆమెను కలిసేందుకు కూడా సిద్దం అవుతున్నాడు.

తమ వారిపై చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వమని విశాల్‌ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే విశాల్‌ అలా డైరెక్ట్‌గా శ్రీరెడ్డిని ఎటాక్‌ చేస్తే ఆమె మరింతగా రెచ్చి పోయే అవకాశం ఉంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.శ్రీరెడ్డి వ్యవహారంలో విశాల్‌ సైలెంగ్‌గా ఉంటేనే బెటర్‌ అంటూ తెలుగు సినీ ప్రముఖులు కొందరు సలహాలు ఇస్తున్నారు.

ఆమెతో మాట్లాడితే ఆమెకు మరింతగా పబ్లిసిటీ ఇచ్చిన వాళ్లం అవుతాం అంటూ కొందరు అంటున్నారు.మొత్తానికి శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో కూడా అలజడి సృష్టించేసింది.

ఆవేశపరుడు అయిన విశాల్‌ ఈ విషయాన్ని ఇంకెంత దూరం లాక్కెల్తాడో అని కొందరు భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube