టీడీపీలో కొత్త స్వరం .. తెరపైకి జూ.ఎన్టీఆర్ !

తెలుగుదేశం పార్టీలో మెల్లమెల్లగా ముసలం స్టార్ట్ అవుతోంది.ఇప్పుడు ఉన్న టీడీపీ మాకు వద్దు అసలు సిసలు టీడీపీ కావాలి అనే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

 Tdp Fans Demands Jr-TeluguStop.com

అంటే ఇప్పుడున్న టీడీపీ అసలు టీడీపీ కాదా అనే ప్రశ్నకు వారు చెప్తున్నా సమాధానం … ఇప్పుడు ఉన్నదీ చంద్రబాబు టీడీపీ , అసలుసిసలు టీడీపీ అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ అని వారు చెప్తున్నారు.అప్పటి టీడీపీ కి విలువలు ఉండేవి .ఇప్పుడు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు దిగిపోయింది అందుకే అన్నగారు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది.మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు తప్పుకుని నందమూరి వారసులకు పార్టీ ని అప్పగించాలి.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీని అప్పగించాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది.

చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికే తెలంగాణలో టీడీపీని భూ స్థాపితం చేసి, ఏ సిద్ధాంతాలను నమ్మి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారో.వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ కాళ్లదగ్గర పార్టీని పెడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత చంద్రన్న టీడీపీగా మార్చేశారు బాబు.

పదేళ్ల ప్రతిక్షంలో ఉన్నా.ఎప్పుడూ చంద్రబాబు నాయకత్వాన్ని.

వద్దనని టీడీపీ నేతలు, అభిమానులు ఇక ఆయన తప్పుకుంటేనే టీడీపీ బ్రతికి బట్టకడుతుందని అంటున్నారు.

తెలంగాణాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కోవడమే.

అందుకే తెలంగాణాలో పార్టీని పట్టించుకోవడం మానేశారు చంద్రబాబు.అంతే కాకుండా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించి.

టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే తెరవెనుక ప్రయత్నాలు చేశారు.దీనికి అడ్డు చెప్పిన మోత్కుపల్లిని పక్కన పెట్టేశారు.

ఇప్పుడు మోత్కుపల్లి కూడా టీడీపీని నందమూరి వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మాజీ టీడీపీ అభిమాని పోసాని కృష్ణమురళి కూడా ‘ఎమ్మెల్యే’ ఆడియ ఫంక్షన్లో టీడీపీ మీది, మీ చేతుల్లోకి తీసుకోండి హరికృష్ణ తనయుడు కల్యాణ్ రామ్ కు సూచించారు.

అలాగే టీడీపీ నేత, నటి కవిత, సీ.ఎన్టీఆర్ ను అభిమానించే నేతలందరూ ప్రస్తుతం అదే కోరుకుంటున్నారు.అలాగే ఎన్టీఆర్ తనయురాలు పురంధరేశ్వరి కూడా టీడీపీని నందమూరి వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు పై నందమూరి అభిమనాలు, టీడీపీ నిజమైన కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
2019లో టీడీపీ అధికారం కోల్పోతే జూ.ఎన్టీఆర్ రంగ ప్రవేశం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఎందుకంటే చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నాయకుడు ఆ పార్టీలో లేరు.ఇక లోకేష్ బాబు సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు.అధికారం ఉన్నంత వరకే ఆయన ఆటలు సాగుతాయని అది కాకుండా పార్టీని నడిపించే సత్తా లోకేష్ కి లేదని కుండ బద్దలుకొట్టేస్తున్నారు నందమూరి అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube