ఇచిన మాట నెరవేర్చడంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని మరిపించేలా చేశారు రాజన్న తనయుడు వైఎస్ జగన్.ప్రత్యేక హోదా కోసం గత కొంతకాలంగా వైసీపి చేస్తున్న పోరు బాటలో ఆ సమయంలో ఏపీ ప్రజలకి చెపిన విధంగానే ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వని పక్షంలో మా ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తారు అని తెలిపారు.
ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి తమ ఎంపీలతో రాజీనామాలు చేయించి మోడీపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చారు.అంతేకాదు వైసీపి ఎంపీల రాజీనామాలతో చంద్రబాబు ని జగన్ ఇరకాటంలోకి నెట్టేశారు.వివరాలలోకి వెళ్తే
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ముందు నుంచీ వైసీపి పోరాటం చేస్తుంటే అసలు స్పెషల్ స్టేటస్ వద్దు అంటూ అన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందో ఆ క్రెడిట్ అంతా జనసేన ,వైసీపి లకి వెళ్ళిపోతుందో అని బయపడి వెంటనే యూ టర్న్ తీసుకున్నారు.అయితే జగన్ ముందుగానే ప్రకటించిన విధంగా తన ఎంపీలు మిథున్ రెడ్డి – మేకపాటి రాజమోహన్ రెడ్డి – వైవీ సుబ్బారెడ్డి – అవినాశ్ రెడ్డి – వరప్రసాద రావు రాజీనామాలు చేయించేశారు.రాజీనామాలు చేసిన ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి తమ రాజీనామాలు అందచేశారు
అంతేకాదు మా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ పార్లమెంటు వేదికగా పోరాటానికి దిగుతున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి5వ తేదీ నుంచి వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు ఆందోళన బాట పట్టనున్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిగా పార్టీ ఎంపీలు పదవులు తృణప్రాయంగా వదిలేశారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పించారు.
అనంతరం ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు
ఇదిలాఉంటే రాజీనామాలపై పునరాలోచించు కోవాలని లోక్‌సభ స్సీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు సూచించారు… అయితే తాము రాజీనామాలకే సిద్ధపడ్డామని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు అయిదుగురూ స్సీకర్‌కు స్పష్టం చేశారు.అయితే ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ లో సదేశం ఉంచారు.“మేం చెప్పిందే చేస్తాం! వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఈరోజు రాజీనామా చేస్తున్నారు.టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని నేను చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా అని అన్నారు మరి చంద్రబాబు వైసీపి ఎంపీల రాజీనామాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.