తెల్లారిలేస్తే.భుజాలు భుజాలు రాసుకుని తిరిగిన నేతలే ఇప్పుడు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు ఎర్త్ పెట్టారని తెలుస్తోంది.
కేంద్రంలో నిన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు సీటు ఖాయమని భావించిన కంభంపాటి.ఢిల్లీ నుంచి పిలుపు రాగానే కుటుంబంతో సహా హస్తినకు వెళ్లారు.
అయితే, అనూహ్యంగా చివరి నిముషంలో కంభంపాటి పేరును మంత్రుల జాబితా నుంచి తొలగించినట్టు తెలియడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది.అయితే, కంభంపాటికి పదవి దక్కకపోవడం వెనుక ఆయనతో కలిసి నడిచిన నేతలే కారణమని తెలుస్తోంది.
వారే కంభంపాటికి శల్య సారథ్యం చేశారని ఢిల్లీలో వినిపిస్తోంది.
మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ నుంచి కేంద్రంలో చక్రం తిప్పిన దత్తాత్రేయకు ప్రధాని మోదీ శ్రీముఖం చూపించారు.
దీంతో తెలంగాణ నేతలు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు.ఈ క్రమంలోనే ఏపీకి చెందిన కంభంపాటికి ఇస్తే.
మరింత గొడవలు పెరిగే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రామ్ మాధవ్‌లు నేరుగా ప్రధానిని కలిసి ఫిర్యాదు చేశారని సమాచారం.దీంతో మోడీ మనసు మార్చుకుని కంభం పాటి పేరును తొలగించారని సమాచారం.
దీంతో మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి.కంభం పాటి నుంచి చేజారి పోయింది.
ఇదిలావుంటే, బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో పాటు.సంఘ్ పరివార్ నేతలు కంభంపాటికి అడ్డుతగిలినట్టు తెలుస్తోంది.
ఏపీలో పూర్తిస్థాయిలో ఎదగాలని భావిస్తున్న బీజేపీకి.కంభంపాటిని మంత్రిని చేస్తే.
ఇబ్బందులు తప్పవని వారు చెప్పారట.పైగా.
కమ్మ వర్గానికి చెందిన సుజనా ఇప్పటికే ఏపీ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారని, కాబట్టి.ఇప్పుడు మళ్లీ అదే వర్గానికి ప్రాధాన్యం ఇస్తే.
ఇబ్బందులు ఎదురవుతాయని అనడంతో చివరి నిముషంలో కంభంపాటికి అడ్డుచెప్పినట్టు తెలుస్తోంది.దీంతో కంభంపాటికి అవకాశం వచ్చి జారిపోయిందని అంటున్నారు.