పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఆమీర్ సొహైల్ భారత్ పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫి ఫైనల్ కి మందు చేసిన కామెంట్స్ గుర్తుకు ఉన్నాయా? పాకిస్తాన్ సొంతంగా మ్యాచులు గెలవడం లేదని, ఫిక్స్ చేసి గెలిపిస్తున్నారని, ఫైనల్ కూడా పాకిస్తాన్ ఫిక్సింగ్ ద్వారానే గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.ఒక పాకిస్తాన్ ఆటగాడు, అందులోను ఒకప్పుడు కెప్టెన్ గా జట్టుని నడిపించినవాడు ఇలాంటి కామెంట్స్ చేయడం అందర్ని షాక్ కి గురి చేసింది.
ఆ తరువాత భారత్ పాకిస్తాన్ ఫైనల్ జరగటం, భారత్ ఓడిపోవడం జరిగింది.
ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఇప్పుడు అమీర్ సొహైల్ మాటలకు మాటలు కలిపాడు కేంద్ర మంత్రి రామ్ దాస్ అతావాలే.
లీగ్ స్టేజి మొత్తం బాగా ఆడి, కేవలం పాకిస్తాన్ ముందే చేతులేలా ఎత్తేస్తారు.టోర్నమెంటు మొత్తం బాగా ఆడిన కొహ్లీ, యువరాజ్ ఆరోజు కావాలనే ఔట్ అయిపోయారు.
మ్యాచ్ ఫిక్సింగ్ చేసి భారత్ ని ఓడించారు అంటూ సంచలన ఆరోపణలు చేసారు.అక్కడితో అగకుండా క్రికేట్ లో కూడా రిజర్వేషన్ల తీసుకురావాలని, దళితులకి అవకాశాలివ్వాలని డిమాండ్ చేసారు మంత్రి.
ఈ కామెంట్స్ పై ఇంటర్నెట్ లో బాగా నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఓ మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు, ఇలాంటివారు ఇక దేశానికి ఏం బాగు చేస్తారు అంటూ విరుచుకుపడుతున్నారు నెటిజన్స్.
ఆ మంత్రి అదృష్టం ఏమిటంటే ఈ కామెంట్స్ పై కొహ్లీ ఇంకా రెస్పాండ్ అవలేదు.అసలే కోపిష్టి అయిన కోహ్లీ ఈ మంత్రికి ఎలాంటి జవాబు చెబుతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.