సినీనటుడు, యాక్టర్ రవితేజ తమ్ముడు భరత్ మరణం ఇంకా వార్తల్లోనే ఉంది.భరత్ మత్తుకి బానిసై, ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు.
కాని అది కాదు పెద్ద వార్త.రవితేజ సొంత తమ్ముడి అంతక్రియులకి ఎందుకు హాజరు కాలేదు.
ఇదే సెన్సెషనల్ న్యూజ్ అయిపోయింది.మీడియా వారు సెన్సేషనలిజం కోసం రవితేజ – భరత్ కి మధ్య లేని గొడవలు సృష్టించారు.
భరత్ చేసిన పనుల వలన రవితేజ పేరుప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి, అందుకే రవితేజ భరత్ ని చివరిసారిగా కూడా చూడాలనుకోలేదు అంటూ ఓ థియేరి క్రియేట్ చేసింది మీడియా.దీనిపై రవితేజ స్పందిచారు.
ఓ దినపత్రికకి రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిసినదేమిటంటే … రవితేజ తమ్ముడు చనిపోయిన బాధ తట్టుకోలేకే చివరిచూపుకి వెళ్ళలేకపోయారు.యాక్సిడెంటులో భరత్ ముఖం గుర్తుపట్టలేకుండా అయిపోవడంతో, ఆ దారుణాన్ని చూడలేక, సంతోషంగా ఉన్న భరత్ ముఖమే ఎప్పటికి గుర్తుండిపోవాలని రవితేజ వెళ్ళలేదట.
చనిపోయిన వారిని చూడటం తన వల్ల కాదని, అందుకే ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా మృతదేహాన్ని చూడటానికి వెళ్ళనని, కొన్నిరోజులు గడిచాక కుటుంబాన్ని పరామర్శిస్తానని రవితేజ చెప్పారు.
మీడియాలో రాసినట్లుగా బయటివాళ్ళతో అంతక్రియలు చేయించలేదని, సొంత బాబయ్ తో చేయించామని, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా మీడియా ఇష్టం వచ్చినట్లు రాసేంసిందని రవి బాధపడ్టారు.
తమ్ముడి మరణం ఎవరికి బాధ కలిగించదు, కాని తాను అన్ని మానేసి కూర్చుంటే నమ్ముకున్న నిర్మాతలు కోట్ల నష్టపోతారు, సినిమాకి పనిచేస్తున్న కార్మికలకి అన్నం దొరకదు, అందుకే చనిపోయిన మరుసటి రోజుకి బాధను దిగమింగుకోని వెళ్ళానని చెప్పుకొచ్చారు రవితేజ.