సెర్చ్ ఇంజన్ అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే పేరు గూగుల్.దీనికి పోటిగా చాలా సెర్చ్ ఇంజన్లు పుట్టుకొచ్చినా, ఎవరు కూడా గూగుల్ దరిదాపుల్లోకి రాలేకపోయారు.
యాహూ లాంటి పెద్ద పోటిదారుడే, పోటిలో నిలబడలేక కంపెనీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ గూగుల్ రాకతోనే ఇంటర్నెట్ యూజర్లు పెరిగారనేది కాదనలేని వాస్తవం.
అలాంటి గూగుల్ ఇప్పుడు ఇండియాలో పెద్ద టార్గెట్ పెట్టుకుంది.
గూగుల్ సౌత్ ఈస్ట్ ఏసియా & ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ఇటివలే ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, ” భారతదేశంలో చాలా సింపుల్ టార్గెట్ పెట్టుకున్నాం.
వందకోట్ల మందిని ఆన్ లైన్ లోకి తీసుకురావాలనేదే మా లక్ష్యం” అని చెప్పుకొచ్చారు .
ప్రస్తుతం మనదేశంలో 50,000 మంది గూగుల్ కి ఆండ్రాయిడ్ డెవెలపర్స్ గా పనిచేస్తున్నారు.ఈ సంఖ్యను పెంచి 2 లక్షలమందికి ఈ ఫీల్డ్ లో ఉద్యోగాలిస్తామని, హిందీ, ఇంగ్లీషులో దొరుకుతున్న చాలారకాల సేవల్ని పూర్తిస్థాయిలో ఇతర భాషల్లోకి కూడా తీసుకువస్తామని రాజన్ ఆనందన్ తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో దాదాపుగా 35 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని అంచనా.2020 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటొచ్చు.మరి గూగుల్ టార్గెట్ గా పెట్టుకున్న ఆ 100 కోట్లమంది లెక్క ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.