బాలివుడ్ మార్కేట్ పెద్దది కాబట్టి, అక్కడి హీరోయిన్లకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.అక్కడి హీరోలతో పోల్చుకుంటే తక్కువే అయినా, దక్షిణాది కథానాయికల కన్నా పెద్ద మొత్తాలనే అందుకుంటూ ఉంటారు హిందీ భామలు.
ఆ డిమాండ్ ఎక్కడికి పోతుంది.దక్షిణాదికి వస్తే మాత్రం తగ్గపోతుందా!
మహేష్ బాబు – మురుగదాస్ సినిమా బడ్జెట్ 80-100 కోట్లు అంటున్నారు.
దాంట్లో ఓ మూడు, నాలుగు కోట్లు హీరోయిన్ మీద పెట్టినా, పెద్దగా తేడా ఏముండదు అనుకున్నారేమో .మొదటినుంచి బాలివుడ్ భామే కావాలనుకున్నవారు.అందుకే ప్రిస్స్ తో ఆడిపాడేందుకు పరిణీతి చోప్రాని తీసుకొచ్చారు.
కోరినట్టే కాల్షీట్లు, ప్రమోషన్స్ లో పాల్గొంటానని హామి ఇచ్చింది పరిణీతి.కాని పారితోషికమే కాస్త ఎక్కువ అడిగేసింది.ఈ భామకి 3.50 కోట్లు చెల్లిస్తున్నారు ఈ సినిమా కోసం.అనుష్క, నయనతార లాంటి సీనియర్లు ఇన్ని సంవత్సరాల తరువాత మూడు కోట్ల దరిదాపుల్లోకి వస్తే, మొదటి సినిమాతోనే అందరిని దాటేసింది మన బాలివుడ్ అందం.
దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయిక ఎవరు అని అడిగితే ఇకనుంచి నయనతార పేరు చెప్పకండి.