యూకేలో ఐదుగురు భారతీయులు అరెస్ట్: భారీగా నేరాలు, అక్రమ సంపాదన

మనీలాండరింగ్ కేసులో యూకేలో ఐదుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు.వీరంతా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు అక్రమ ఇమ్మిగ్రేషన్ ద్వారా మిలియన్ పౌండ్లు సంపాదించేందుకు కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

 5indians Nationals Charged In Money Gang Bust In Uk-TeluguStop.com

ఈ వారం ప్రారంభంలో ఒక మహిళ సహా 10 మందిని యూకేలోని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) అదుపులోకి తీసుకుంది.వీరంతా 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వారే.

వీరిలో ఐదుగురు భారతీయులు కాగా.మరికొందరు బ్రిటీష్, ఫ్రెంచ్ జాతీయులు.

అరెస్టయిన భారతీయులు:

చరణ్ సింగ్, వాల్జీత్ సింగ్, జస్బీర్ సింగ్ ధల్, సుందర్ వెంగడస్సలం, జస్బీర్ సింగ్ మల్హోత్రా, మన్మోన్ సింగ్ కపూర్, పింకీ కపూర్

Telugu Gang Bust Uk, Telugu Nri Ups-

వీరంతా యూకేలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూపులో సభ్యులుగా పనిచేస్తూ క్రిమినల్ నేరాల ద్వారా వచ్చిన డబ్బును అక్రమ మార్గాల ద్వారా తరలించేందుకు కుట్ర పన్నినట్టు ఎన్‌సీఏ దర్యాప్తులో తేలింది.వీరిలో స్వాందర్‌సింగ్ ధాల్, జస్బీర్ సింగ్ కపూర్, దిల్జన్ మల్హోత్రాలపై పైన వివరించిన నేరాలతో పాటు అక్రమ వలసదారులు యూకేలోకి ప్రవేశించేందుకు సాయం చేశారన్న అభియోగాలపై కేసులు నమోదు చేసినట్లు ఎన్‌సీఏ శుక్రవారం తెలిపింది.

Telugu Gang Bust Uk, Telugu Nri Ups-

నైరుతి లండన్‌లో బుధవారం ఎన్‌సీఏ నిర్వహించిన దాడుల్లో వీరంతా పట్టుబడ్డారు.అనంతరం వీరిని ఉక్స్‌బ్రిడ్జ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.కాగా.ఈ గ్రూపు సభ్యులు యూకే నుంచి 15.5 మిలియన్ పౌండ్లను సూట్‌కేసుల ద్వారా దుబాయ్‌కు పంపివుంటారని ఎన్‌సీఏ అనుమానిస్తోంది.ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం దుబాయ్ పోలీసులు, బోర్డర్ ఫోర్స్, స్కాట్లాండ్ యార్డ్‌ల సాయం తీసుకుంటామని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.

క్లాస్ ఏ డ్రగ్స్, అక్రమ ఇమ్మిగ్రేషన్ తదితర నేరాల ద్వారా సంపాదించిన మిలియన్ల కొద్ది పౌండ్లను ఈ ముఠా గత మూడేళ్లుగా దుబాయ్‌కి తరలిస్తున్నట్లు ఎన్‌సీఏ దర్యాప్తులో తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube