2021.. యూట్యూబ్ లో దుమ్మురేపిన టాప్ 10 మూవీ సాంగ్స్ ఏంటో తెలుసా?

ఆయా హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే.వారి ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

 2021 Top Youtube Songs In This Year Details, 2021 Youtube Songs, More Views Son-TeluguStop.com

వారి సినిమాలు ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టేలా తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు.సినిమాను బరిలోకి దించడమే తమ బాధ్యత.

రెచ్చిపోవాల్సింది అభిమానులే అనేలా ప్రవర్తిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.ప్రస్తుతం ఒకరిని మించి మరొకరు యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు.ఇంతకీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన పాటలేంటో తెలుసుకుందాం.

ఉ అంటావా మావ.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా. చేసిన తొలి ఐటెం సాంగ్.

పుష్ప సినిమాలో ఆమె చేసిన ఈ పాట సోషల్ మీడియాలో రికార్డులు తిరగ రాసింది.ఈ పాట విడుదల అయిన 24 గంట్లోనే కోటి 24 లక్షల వ్యూస్ సాధించింది.

లాలా భీమ్లా

పవన్ కల్యాణ్  హీరోగా చేస్తున్న భీమ్లానాయక్ సినిమాలోని ఈ పాట కూడా బాగా పాపులర్ అయ్యింది.24 గంటల్లో కోటీ 2 లక్షలతో వ్యూస్ తో సంచలనం కలిగించింది.

సామి సామి

యూట్యూబ్ లో 24 గంటల్ల సంచలనం కలిగించిన మూడో పాటగా పుష్ప సినిమాలోని సామి సామి అనే పాట నిలిచింది.90 లక్షల వ్యూస్ అందుకుంది.అటు నాలుగో స్థానంలోనూ పుష్ప పాటే నిలిచింది.83 లక్షల వ్యూస్ తో దాక్కో దాక్కో మేక అనే పాట నిలిచింది.శ్రీవల్లీ అనే పాట కూడా 69 లక్షల వ్యూస్ అందుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అనే సాంగ్ 24 గంటల్లో 70 లక్షల వ్యూస్ అందుకుంది.8వ ప్లేస్ లో నిలిచింది.జనని అనే సాంగ్ విడుదలైన 24 గంటల్లో 60 లక్షల 50వేల వ్యూస్ అందుకుంది.

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు నుంచి రిలీజైన మైండ్ బ్లాక్ సాంగ్ ఇప్పటీకీ టాప్ 6 ప్లేస్ లోనే కొనసాగుతుంది.బన్నీ అలవైకుంఠపురంలో రాములో రాముల సాంగ్ ఏడో స్థానంలో నిలిచింది.మొత్తంగా టాప్ 10 సాంగ్స్ లో 5 పాటలు పుష్ప సినిమాలోనివే కావడం విశేషం.

Top Tollywood Songs in Youtube #Youtube

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube