తెలుగులో విలక్షణమైన పాత్రలు చేసి ఆ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు.తాజాగా కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకసారి కార్మికుల కొరకు నేను నిరాహార దీక్ష చేశానని చెప్పారు.
చెన్నై నుంచి హైదరాబాద్ కు ఇండస్ట్రీ వస్తున్న సమయంలో మద్రాస్ లో మాత్రమే షూటింగ్ లు జరుపుకోవాలని లేదా హైదరాబాద్ లో షూటింగ్ లకు కూడా అక్కడివాళ్లను పెట్టుకోవాలని రూల్స్ తెచ్చారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ నిబంధనల వల్ల సినిమా రంగంలో ఒక రకమైన అనిశ్చితి నెలకొందని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
మద్రాస్ లో ఉన్న సమయంలో తెలుగువాళ్లు తమిళ సినిమాలకు కూడా పని చేశారని సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇక్కడి వారికి ఉపాధి కలుగుతోందని అందరూ అన్ని చోట్లా పని చేయకుండా కొన్ని చోట్ల మాత్రమే పని చేస్తామని చెబితే ఇండస్ట్రీకి సరిపోదని నా ఆలోచనలో మాత్రం పాత విధానాన్ని అనుసరిస్తే మంచిదని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అప్పటికే ఇండస్ట్రీలో పేరు ఉండటంతో నిరాహార దీక్ష చేయాలని అనుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
దీక్ష చేసే సమయంలో తన చుట్టూ జనం చేరేవారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.నాగార్జున, వెంకటేష్ కూడా నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
కానీ తను వద్దని చెప్పానని నాగార్జున, వెంకటేష్ వస్తే జనాలను అదుపు చేయడం కష్టమని భావించానని కోట శ్రీనివాసరావు తెలిపారు.
మీరు నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పారని అదే నాకు చాలని తాను అన్నానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.నాగార్జున వస్తే పబ్లిక్ కంట్రోల్ లో ఉండరని ఎక్కువ సంఖ్యలో జనం హాజరవుతారని వెంకటేష్ బాబుకు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.నా అనుమానాలను ఆయా హీరోలు సహృదయంతో అర్థం చేసుకున్నారని కోట శ్రీనివాసరావు తెలిపారు.