2021: ఈ ఏడాది జనాలను ఆకట్టుకున్న సినీ జోడీలు ఏవో తెలుసా?

ఒకప్పుడు కొన్ని హిట్ జంటలు ఉండేవి.ఫలానా హీరో, హీరోయిన్ కలిసి నటిస్తే సినిమా పక్కా హిట్ అవుతుంది అనే ఓ టాక్ ఉండేది.

 2021 Best Jodi's In Tollywood , Venkatesh -meena, Saipallavi-nani, Raviteja-srut-TeluguStop.com

వారితో కలిసి సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది.తాజాగా ఈ ఏడాది కొన్ని జంటలు సినీ అభిమానులను బాగా అలరించాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*వెంకటేశ్, మీనా

Telugu Jodis Tollywood, Jodis, Pawankalyan, Saipallavi Nani, Tollywood, Venkates

వీరిద్దరు కలిసి ఎన్నో చక్కటి సినిమాలు చేశారు.వాటిలో చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.చంటి, సుంద‌ర‌కాండ‌, అబ్బాయి గారు, సూర్య‌వంశం, దృశ్యం సహా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

ఈ హిట్ జోడీ తాజాగా దృశ్యం 2 సినిమాతో జనాల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.అందరి చేత ప్రశంసలు దక్కించుకుంది.

*ప‌వ‌న్ కల్యాణ్, శ్రుతి హాస‌న్

Telugu Jodis Tollywood, Jodis, Pawankalyan, Saipallavi Nani, Tollywood, Venkates

వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.గబ్బర్ సింగ్ సినిమాతో బాగా ఆకట్టుకున్న ఈ జంట.కాట‌మ రాయుడుతోనూ అదే జోరును కొనసాగించింది.తాజాగా వకీల్ సాబ్ తోనూ మరోసారి హిట్ పెయిర్ గా నిలిచింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

*ర‌వితేజ, శ్రుతి హాస‌న్

Telugu Jodis Tollywood, Jodis, Pawankalyan, Saipallavi Nani, Tollywood, Venkates

వీరు కూడా పలు సినిమాలు చేశారు.బ‌లుపుతో రవితేజ, శ్రుతి జనాలను బాగా ఆకట్టుకున్నారు.ఈ ఏడాది విడుదల అయిన క్రాక్ సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకున్నారు.

*నాని, సాయి ప‌ల్ల‌వి

Telugu Jodis Tollywood, Jodis, Pawankalyan, Saipallavi Nani, Tollywood, Venkates

వీరు కూడా సక్సెస్ ఫుల్ జంటగా నిలిచారు.నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఎంసీఏ సినిమాతో జనాలను బాగా ఆకట్టుకున్నారు.ఆ తర్వాత మళ్లీ జోడీ కట్టారు.

తాజాగా విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ లో కూడా వీరిద్దరు మంచి నటన కనబర్చారు.ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది.

గతంలో వచ్చిన నాని సినిమాతో పోల్చితో వైవిధ్యం కలిగిన కథతో ఈ సినిమా తెరకెక్కి సక్సెస్ అయ్యింది అంటున్నారు సినిమా నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube