2018 ఫిలిం ఫేర్ అవార్డ్ లకి బరిలో ఉన్న నటులు , సినిమాలు , దర్శకులు , ఎవరో చూడండి..

2017వ సంవత్సరం మన తెలుగు పరిశ్రమ కి బాగా కలిసి వచ్చిన సంవత్సరం సంక్రాంతి నుండి ఏడాది చివరి వరకు వచ్చిన చాలా సినిమాలు కలెక్షన్స్ తో దూసుకుపోయాయి.మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తరువాత కమ్ బ్యాక్ సినిమా గా తీసిన ఖైదీ నం.150 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అలాగే బాలకృష్ణ గారి 100 చిత్రం గౌతమీ పుత్ర శతకర్ని కూడా 50 కోట్ల కలెక్షన్స్ చేసింది.2017 లో పెద్ద హీరోలకే కాదు చిన్న హీరోలకి మరియు కొత్త దర్శకులకు విజయాలు వచ్చాయి.అర్జున్ రెడ్డి తో సందీప్ వంగ, ఘజి తో సంకల్ప్ రెడ్డి మంచి పేరును తెచ్చుకున్నారు

 2018-TeluguStop.com

సినిమాకి కలెక్షన్ లు వస్తేనే కాదు అవార్డ్ లు వచ్చినప్పుడే సినిమా బృందానికి ఆనందం ఉంటుంది.జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకు జరగబోతున్న విషయం తెలిసిందే.ప్రతి సంవత్సరం ఫిలిఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.

ఈ సంవత్సరం బరిలో చాలా మంది హీరోలు దర్శకులు ఇతర నటులు ఉన్నారు , వారెవరో చూడండి…

ఉత్తమ కథానాయకుడి కేటగిరి లో :


1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)
2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )

ఉత్తమ చిత్రం కేటగిరీ లో :


1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) బాహుబలి 2

ఉత్తమ దర్శకుల కేటగిరీ లో :


1) క్రిష్ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
2) ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
3) సందీప్ రెడ్డి వంగా ( అర్జున్ రెడ్డి )
4) శేఖర్ కమ్ముల ( ఫిదా )
5) సంకల్ప్ రెడ్డి ( ఘాజి )
6) సతీష్ వేగేశ్న ( శతమానం భవతి )

ఉత్తమ కథానాయకి కేటగిరి లో :


1) అనుష్క ( బాహుబలి 2)
2) రితిక సింగ్ ( గురు )
3) నివేదా థామస్ ( నిన్ను కోరి )
4)రకుల్ ప్రీత్ సింగ్ ( రారండోయ్ వేడుక చూద్దాం)
5) సాయి పల్లవి ( ఫిదా )

వీటితో పాటుగా పలువురు కేటగిరి లలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు .అయితే ఉత్తమ కథానాయకుడు ఎవరు ? ఉత్తమ చిత్రం ఏది ? అన్న దాంట్లో మాత్రం కాస్త టెన్షన్ నెలకొన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube