గ్లోబల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో తాను నంబర్ వన్ అని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓ పార్టీలో తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ప్రస్తుతం ఆ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.ఒక రోజు తాను జుకర్‌బర్గ్‌తో కలిసి డిన్నర్ చేశానని ఆ సమయంలో… ‘‘తాను మిమ్మిల్ని అభినందించాలని అనుకుంటున్నానని, ఎందుకంటే మీరు ఫేస్‌బుక్‌లో నెంబర్‌వన్’’ అని జుకర్ చెప్పారని ట్రంప్ తెలిపారు.
సోమవారం రైట్ వింగ్ రేడియో టాక్ షో హోస్ట్ రష్ లింబాగ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్.ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం చెప్పలేదు.అయితే ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ.ట్రంప్-జుకర్ బర్గ్‌ల మధ్య అక్టోబర్‌లో వైట్‌హౌస్ వేదికగా ఈ విందు జరిగిందని తెలిపారు.
కాగా ట్రంప్ తన సందేశాలను, ఇతర విషయాలను ప్రజలతో పంచుకోవడానికి సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఇక్కడ అధ్యక్షుడు తమను పట్టించుకోకపోవడంపై సాంప్రదాయ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది తమపై పక్షపాతమని ఆరోపించింది.
డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్‌లో దాదాపు 70 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇలాంటి వేదికలు లేకపోతే మనం ఎంతో కోల్పోతామని ట్రంప్ లింబాగ్‌తో అన్నారు.కాగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను వ్యాపింప చేయడంపై అమెరికాలోని సోషల్ మీడియా వేదికలు విమర్శలకు గురవుతున్నాయి.
అవాస్తవ ప్రకటనలు, కుట్రలు వంటి వాటిని జనాల్లోకి తీసుకెళ్లడానికి ట్రంప్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను ఉపయోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
>అదే సమయంలో రాజకీయ ప్రకటనల వ్యయం విషయంలో ట్రంప్ ఫేస్‌బుక్‌లో నంబర్ వన్ అని, రిపబ్లిక్ పార్టీ సైతం ఫేస్‌బుక్‌ను పలు విషయాల్లో ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్‌తో గల సంబంధాలను ఫేస్‌బుక్ బహిర్గతం చేయాలంటూ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి, సెనేటర్ ఎలిజబెత్ వారెన్ డిమాండ్ చేశారు.