వైసీపీలో మ‌రో న‌టీమ‌ణి.. రంప‌చోడ‌వ‌రం నుంచే పోటీ..!       2018-06-19   23:36:16  IST  Bhanu C

రాష్ట్రంలో రాజ‌కీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నిక‌ల ఏడాది ప్రారంభం కావ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ పార్టీలు గెలుపు గుర్రాల‌ను ఒడిసి ప‌డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కిన వంత‌ల రాజేశ్వ‌రి.. మొద‌ట్లో వైసీపీ త‌ర‌ఫున సానుకూల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం టీడీపీ అధినేత చంద్ర‌బాబు విసిరిన ఆకర్ష్ వ‌ల‌లో చిక్కుకుని పార్టీ నుంచి జంప్ చేశారు. దీంతో ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన నేత లేర‌నే టాక్ వ‌స్తోంది. దీనిని గ‌మ‌నించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వంతల రాజేశ్వ‌రి పోటీ ప‌డినా.. ఆమెను సైతం ఓడించగ‌ల నాయ‌కురాలిని వెతికి ప‌ట్టుకున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

రంప‌చోడ‌వ‌రం నియోజకవర్గంలో గొండోలు సర్పంచ్ రాఘవ, కుమార్తె ధన లక్ష్మిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌ని ఇక్క‌డ ఇంచార్జ్‌గా ఉన్న అనంతబాబు పెద్ద ఎత్తున పరిచయం చేస్తున్నారు. ధ‌నలక్ష్మి బీఎస్సీ బీఎడ్ వరకు చదుకున్నారు. ప్ర‌ముఖ విప్లవ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్ నారాయణ మూర్తి గ‌తంలో తీసిన‌ అడవి బిడ్డలు సినిమాలో హీరోయిన్‌గా చేశారు. అదేవిధంగా నారాయణ మూర్తి తీసిన ప‌లు చిత్రాల్లోనూ ఆమె నటించారు.

ధనలక్ష్మి గిరిజన తెగకి చెందిన కొండ‌ దొర కులం నుంచి వచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై ప‌లువురు ఆశ‌లు పెట్టుకున్నారు. విలీన మండలాలు కలవటంతో ఈ నియోజకవర్గం లో కొండ‌ రెడ్డి తరవాత కోయ దొరలూ ప్రధాన కులం గా వున్నారు. కోయ దొర కులానికి చెందిన, ఏలేశ్వరం డాక్టర్ కుంజం సత్యనారాయణ దొర వైసీపీ టికెట్ పై పలు అసలు పెట్టుకున్నారు. అంతేకాదు, ఆయ‌న‌ అనుచరులు అయితే డాక్టర్‌కే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో సత్యనారాయణ దొర ని పార్టీ అధిష్టానం పిలిచి నియోజకవర్గం పరిస్థితులు మీద చర్చింది.

ఈ నేపధ్యంలో అనంత బాబు రంగ ప్రవేశం చేసి , ధన లక్ష్మి ని తెరపైకి తేవ‌డం గ‌మనార్హం. ధనలక్ష్మికి అనుకూలంగా మొత్తం 11 మండలాలు లో పార్టీ క్యాడర్ తో తీర్మానం చేయించి పార్టీ అధిష్టానానికి పంపే ఆలోచనలో అనంత బాబు ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇక్క‌డ వంత‌ల రాజేశ్వ‌రికి పూర్తిస్థాయిలో పోటీ ఇవ్వ‌గ‌లిగే ఆర్థిక శ‌క్తి ధ‌నల‌క్ష్మికి లేద‌నే ప్ర‌చారం మ‌రోప‌క్క సాగుతోంది. ఇక‌, పార్టీ అధినేత జ‌గ‌న్‌.. స‌త్య‌నారాయ‌న‌దొర వైపే మొగ్గుతున్నార‌ని ఆయ‌న వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. మొత్తంగా ఈప‌రిణామం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. ధ‌న‌ల‌క్ష్మికి ఇక్క‌డ సీటు ఇస్తే వైసీపీలో రోజా త‌ర్వాత అసెంబ్లీ సీటు ద‌క్కించుకున్న రెండో హీరోయిన్‌గా ఆమె నిలుస్తుంది.