కరోనా లాక్‌డౌన్ వేళ నగరంలో ఎన్నో మంచి చెడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒక్కో సమయంలో పౌరులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే, మరి కొన్ని చోట్ల పోలీసులతో యువకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
ఏది ఏమైనా మనందరి కోసం, సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఎవరైన సమన్వయంతో వ్యవహరిస్తే ఇబ్బందులే తలెత్తవు.
కానీ కొందరు ఆకతాయి యువకుల వల్ల మంచి వారు కూడా చెడ్ద వారిగా చిత్రీకరించ బడుతున్నారు.ఇకపోతే మ్యానర్స్ లేని కొందరు యువకులు రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారట.
వీరు కరోనా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా, లాక్ డౌన్ టైమ్ మించిపోయినప్పటికి, హెల్మెట్ లేకుండా బైక్‌ల పై తిరుగుతు ప్రశ్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా వారి పై దాడికి ప్రయత్నించారట.అంతే కాకుండా నానా తిట్లు తిడుతూ అక్కడి నుండి పారిపోయారట.
ప్రస్తుతం వీరి వేటలో ఉన్నారట పోలీసులు.కానీ ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని, ఇలాంటి వారి బెండు తీస్తేనే బుద్ది వస్తుందని నెటిజన్స్ చివాట్లు పెడుతున్నారట.