వెండితెరపై సినిమాల్లో హీరోగా నటించడం సులువే అయినా రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించడం తేలిక కాదనే సంగతి తెలిసిందే.షోలో ఒక ప్రశ్నకు సమాధానం నరసింహ నాయుడు కాగా ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నరసింహ నాయుడు సినిమాకు బీ గోపాల్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తన లైఫ్ లో మరిచిపోలేని సినిమా నరసింహ నాయుడు అని తారక్ వెల్లడించారు.
తాను నరసింహ నాయుడు సినిమాను ఊర్వశి థియేటర్ లో చూశానని ఎన్టీఅర్ చెప్పుకొచ్చారు.తాను ఆ సినిమాను చూస్తున్న సమయంలో ముందు సీటును తంతే ఆ సీటు విరిగిపోయిందని తారక్ పేర్కొన్నారు.
తాను కూచిపూడి డ్యాన్సర్ నని సుధాకర్ గారు తనకు కూచిపూడి డ్యాన్స్ నేర్పించారని తారక్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సుధాకర్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారని ఆయనను కలుసుకోవడం తనకు వీలు కాలేదని ఎన్టీఆర్ అన్నారు.
తనకు కూచిపూడి నేర్పించిన గురువు సుధాకర్ కు ఎన్టీఆర్ ప్రణామం పెట్టారు.తాను ఏం చదువుకున్నా తనకు నటన మాత్రమే తెలుసని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తాతగారి, నాన్నగారి స్పూర్తితో తాను నటుడు కావాలని కలలు కన్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.నాకు చాలా విషయాలపై అవగాహన ఉన్నప్పటికీ దృష్టి మాత్రం నటనపైనే ఉండేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
నటన కోసం చావడానికైనా సిద్ధం అంటూ తారక్ షాకింగ్ కామెంట్లు చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటెస్టెంట్లతో ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతున్నారు.షో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఎన్టీఆర్ హోస్టింగ్ విషయంలో మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.డిసెంబర్ మొదటివారం వరకు ఈ షో ప్రసారం కానుందని సమాచారం.
ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానుంది.