వైరల్: బాలుడి గాత్రానికి నెటిజన్లు క్లీన్ బౌల్డ్... పాడుతా తీయగా చల్లగా అంటున్నాడు పిల్లోడు?

సంగీతానికి బాండరాయి అయినా చాలించాల్సిందే అని అంటారు.అవును.

 Young Child Singing While Playing The Piano Video Viral Details, Boy, Singing, V-TeluguStop.com

సాక్షాత్తు డాక్టర్లే చెబుతున్నారు.కొన్ని మానసికమైన జబ్బులకు సంగీతం ఓ ఔషదంలాగా పనిచేస్తుందని.

ఈ సృష్టిలోని ప్రతి జీవి సంగీతాన్ని ఆస్వాదిస్తాయట.అంతటి మహిమ ఉన్న సంగీటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

కొంతమంది పాడుతుంటే మనసుకి ఎంతో హాయిగా వుంటుంది.మరికొంతమంది పడితే జోలపాటలాగా తోస్తుంది.

ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదన్నా పాటను సరియైన రీతిలో ఆలపించినపుడు, ఆ పాట మనం వినేటప్పుడు కలిగే హాయిని నోటితో వర్ణించలేము.

ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.

నేటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు పుడుతూనే ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు.అతి చిన్న వయసులోనే ఎన్నో ప్రత్యేకతలు చాటుతున్నారు.

ఇదిగో ఇక్కడ ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తూ, తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు.ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎలాంటివారైనా ఫిదా అయిపోవాల్సిందే.

ఆ బాలుడు చిన్నప్పుడు స్కూల్‌లో పాడిన‌ ‘గులాబీ ఆంఖే’ పాట గతంలో వైర‌ల్ అయిన సంగతి తెలిసినదే కదా.

ఇప్పుడు తాజాగా ఆ పిల్లవాడు మరలా పాడ‌డం మొద‌లెట్టాడు.చక్కగా కీబోర్డు వాయించ‌డం కూడా నేర్చుకున్నాడు.ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహ‌బూబ్ ఖాయ‌మ‌త్ హోగీ’ అంటూ ప్రముఖ సింగర్‌ కిశోర్‌కుమార్‌ పడిన పాటని ఆలపించారు.

ఆ పిల్లాడు ఆలపించి తీరుకి నెట్టింట్లో జనాలు ఫిదా అయిపోతున్నారు.దాంతో షేర్లు మీద షేర్లు చేస్తున్నారు ఆ వీడియోని.ఇక ఈ వీడియోను IAS అధికారి అవనీశ్‌ శరణ్ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసారు.ఈ వీడియోకు అవ‌నీశ్ శ‌ర‌ణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube