బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ( Shahrukh Khan ) తాజాగా జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.సెప్టెంబర్ 7వ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా వారం రోజుల్లోనూ దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టిస్తుంది.పఠాన్ సినిమాతో సక్సెస్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ వెంటనే జవాన్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమాలో నయనతార ( Nayanatara ) ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ( Deepika Padukone ) గెస్ట్ పాత్రలో నటించారు.
ఈ విధంగా ఈ సినిమాలో దీపిక గెస్ట్ పాత్రలో నటించిన అందుకుగాను భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఈ సినిమాలో దీపిక నటించినందుకుగాను సుమారు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై దీపికా స్పందించారు.ఈ సందర్భంగా ఈమె తన రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు.
జవాన్ సినిమా కోసం తాను 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
ఇక ఈ సినిమాలో నటించినందుకు తాను ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, తాను ఉచితంగా ఈ సినిమాలో నటించానని ఈమె తెలియజేశారు.ఇక తన భర్త నటించిన 83 సినిమాకు గాను తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.భర్త విజయంలో భార్య భాగమయ్యే పాత్రలో తాను నటించాను అందుకే రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
ఇక షారుఖ్ ఖాన్ అలాగే రోహిత్ శెట్టి( Rohith Shetty ) సినిమాలకు తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండా గెస్ట్ రోల్స్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా దీపికా పదుకొనే చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.