ఐఫోన్ 15 కి గట్టి పోటీగా షావోమి స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..!

ప్రముఖ మొబైల్ కంపెనీ షావోమి తన 13T సిరీస్ ను ప్రారంభించింది.ఇందులో షావోమి 13T, షావోమి 13T ప్రో( Xiaomi 13T, Xiaomi 13T Pro ) అనే రెండు మోడళ్లు ఉన్నాయి.

 Xiaomi Smart Phone As A Tough Competition To Iphone 15 Features Adurs , Iphone 1-TeluguStop.com

అయితే ఈ షావోమి 13T సిరీస్ .ఐఫోన్ 15కి గట్టి పోటీ ఇస్తుందని టెక్ వర్గాలు అంటున్నారు.ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏమిటో చూద్దాం.షావోమి 13T ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో ఉంటుంది.1.5k రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ వీడియోలు చూడడానికి, గేమ్స్ ఆడేందుకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగి ఉంటుంది.డాల్బీ అట్మోస్ తో కూడిన స్టీరియో స్పీకర్ ఉన్నాయి.

షావోమి 13T ప్రో స్మార్ట్ ఫోన్ అద్భుతమైన కెమెరా సిస్టంతో( camera system ) వస్తుంది.ఈ ఫోన్ లోని కెమెరాలో 50-మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.టెలిఫోటో లెన్స్ లో 50-మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది.అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లో 12-మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.ఈ ఫోన్ 8కె వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తుంది.12 ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది.120w ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.16GB RAM+ 1TB స్టోరేజ్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 799 Euros.మన భారత కరెన్సీలో సుమారుగా రూ.70000 గా ఉంటుంది.మిగతా స్టోరేజ్ వేరియంట్ల ధర కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

అయితే ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, మెడో గ్రీన్, ఆల్పైన్ బ్లూ అనే మూడు కలర్లలో లభించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube