ఈ కారును చూస్తే షాక‌వుతారు... దీని ఫీచ‌ర్స్ చూస్తే మ‌తిపోతుంది!

ప్రపంచంలోనే అతి చిన్న కారు.పీల్ P50.దీని పొడవు 134 సెంటీమీటర్లు (4.3 అడుగులు) మాత్రమే.దీని పెట్రోల్ ట్యాంక్ 5 లీటర్లు మాత్రమే.చిన్న కారు వల్ల ప్రజలు తనను ఎగతాళి చేసిన‌ప్ప‌టికీ ఈ కారుతో ఎంతో పొదుపు చేయ‌గ‌ల‌న‌నిఈ కారు యజమాని చెప్పాడు.

 World Smallest Car Lowest Fuel Bill Details, World Smallest Car, Pl P50 Car, Bri-TeluguStop.com

కారు యజమాని పేరు అలెక్స్ ఓర్చిన్. అతడికి 31 ఏళ్లు.అతను యూకేలోని ససెక్స్ నగరంలో తన రోజువారీ పని కోసం ఈ కారును ఉపయోగిస్తాడు.కారు నీలి రంగులో ఉంది.

ఈ కారు 42 kmpl మైలేజీని ఇస్తుంది.

కారు పొడవు 134 సెం.మీ, వెడల్పు 98 సెం.మీ మరియు ఎత్తు 100 సెం.మీ.దీనికి 3 చక్రాలు ఉన్నాయి.దీనిని బ్రిటన్‌కు చెందిన పీల్ ఇంజినీరింగ్ కంపెనీ తయారు చేసింది.ఇందులో 4.5 హార్స్ పవర్ ఇంజన్ ఉంది.ఈ కారు 1962 నుండి 1965 మ‌ధ్య‌కాలంలో తయారు చేశారు.

తరువాత 2010లో దీనిని ఆధునీక‌రించారు.ఈ వన్ సీటర్ కారులో సూట్‌కేస్‌ను కూడా పెట్టుకోడానికి స్థలం లేదు.

కారులో కూర్చున్న‌పుడు అలెక్స్ తన పాదాన్ని స్టీరింగ్‌కు ఒకవైపు సర్దుబాటు చేయాల్సి వ‌స్తుంది.

Telugu Alex Orchin, Britain, Seater Car, Pl Company, Pl Car, Smallest Car-Latest

టాప్ గేర్ షోలో జెరెమీ క్లార్క్సన్ ఈ కారును నడపడం అలెక్స్ చూశాడు.ఆ తర్వాత అతనికి ఈ కారు బాగా నచ్చింది.గతేడాది ఈ కారులోనే బ్రిటన్ మొత్తం తిరిగాడు.

దీని గరిష్ట వేగం గంటకు 37 కి.మీ.అలెక్స్ మాట్లాడుతూ- నాకు చిన్నప్పటి నుంచి పాతకాలపు, విభిన్నంగా కనిపించే కార్లంటే ఇష్టం.పాతకాలపు కార్లు నడపడం నాకు చాలా ఇష్టం.

నా దగ్గర 1914 మోడల్ T మరియు 1968 మోరిస్ మైనర్ కార్లు కూడా ఉన్నాయ‌ని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube