ఈ కారును చూస్తే షాకవుతారు... దీని ఫీచర్స్ చూస్తే మతిపోతుంది!
TeluguStop.com
ప్రపంచంలోనే అతి చిన్న కారు.పీల్ P50.
దీని పొడవు 134 సెంటీమీటర్లు (4.3 అడుగులు) మాత్రమే.
దీని పెట్రోల్ ట్యాంక్ 5 లీటర్లు మాత్రమే.చిన్న కారు వల్ల ప్రజలు తనను ఎగతాళి చేసినప్పటికీ ఈ కారుతో ఎంతో పొదుపు చేయగలననిఈ కారు యజమాని చెప్పాడు.
కారు యజమాని పేరు అలెక్స్ ఓర్చిన్.అతడికి 31 ఏళ్లు.
అతను యూకేలోని ససెక్స్ నగరంలో తన రోజువారీ పని కోసం ఈ కారును ఉపయోగిస్తాడు.
కారు నీలి రంగులో ఉంది.ఈ కారు 42 Kmpl మైలేజీని ఇస్తుంది.
కారు పొడవు 134 సెం.మీ, వెడల్పు 98 సెం.
మీ మరియు ఎత్తు 100 సెం.మీ.
దీనికి 3 చక్రాలు ఉన్నాయి.దీనిని బ్రిటన్‌కు చెందిన పీల్ ఇంజినీరింగ్ కంపెనీ తయారు చేసింది.
ఇందులో 4.5 హార్స్ పవర్ ఇంజన్ ఉంది.
ఈ కారు 1962 నుండి 1965 మధ్యకాలంలో తయారు చేశారు.తరువాత 2010లో దీనిని ఆధునీకరించారు.
ఈ వన్ సీటర్ కారులో సూట్‌కేస్‌ను కూడా పెట్టుకోడానికి స్థలం లేదు.కారులో కూర్చున్నపుడు అలెక్స్ తన పాదాన్ని స్టీరింగ్‌కు ఒకవైపు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.
"""/"/
టాప్ గేర్ షోలో జెరెమీ క్లార్క్సన్ ఈ కారును నడపడం అలెక్స్ చూశాడు.
ఆ తర్వాత అతనికి ఈ కారు బాగా నచ్చింది.గతేడాది ఈ కారులోనే బ్రిటన్ మొత్తం తిరిగాడు.
దీని గరిష్ట వేగం గంటకు 37 కి.మీ.
అలెక్స్ మాట్లాడుతూ- నాకు చిన్నప్పటి నుంచి పాతకాలపు, విభిన్నంగా కనిపించే కార్లంటే ఇష్టం.
పాతకాలపు కార్లు నడపడం నాకు చాలా ఇష్టం.నా దగ్గర 1914 మోడల్ T మరియు 1968 మోరిస్ మైనర్ కార్లు కూడా ఉన్నాయని తెలిపాడు.
కళ్యాణ్ రామ్ ను ట్రోల్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే?