ఓట్ మిల్క్.రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.
ఓట్స్ నుంచి తయారు చేసే ఈ పాలను రెగ్యులర్‌గా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఓట్ మిల్క్ చర్మ సౌందర్యానికి సైతం ఎంతగానో తోడ్పడతాయి.
ముఖ్యంగా ఓట్ మిల్క్‌ను ఇప్పుడు చెప్పే విధంగా యూజ్ చేస్తే బోలెడన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మరి లేటెందుకు ఓట్ మిల్క్‌ను చర్మానికి ఎలా వాడాలి.? అసలు ఓట్ మిల్క్ వల్ల వచ్చే సౌందర్య ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఓట్ మిల్క్, ఒక స్పూన్ కోకో పౌడర్, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆపై చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుంది.ముడతలు తగ్గి చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఓట్స్ మిల్క్, ఒక స్పూన్ క్యారెట్ జ్యూస్, అర స్పూన్ తేనె తీసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత దూది సాయంతో ఈ మిశ్రమానికి పట్టించి.పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్‌తో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గి.ముఖం కాంతి వంతంగా మెరిసి పోతుంది.
ఇక చివరిగా.ఓట్ మిల్క్ మీరు ఇంట్లోనే తయారు చేసుకుని వాడొచ్చు.
లేకుంటే బయట డైరీస్‌లోనూ ఓట్ మిల్క్ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.అక్కడ నుంచి కూడా ఓట్ మిల్క్‌ను తెచ్చుకుని యూజ్ చేయవచ్చు.