క్యాన్సర్.ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తుంటారు.ఎందుకంటే, ఈ వ్యాధిలో జీవించడం కష్టంగా మారుతుంది.అయితే చాలా మంది ఈ వ్యాధిని కూడా ఓడించారు.ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ.అదే సమయంలో, మానసిక మరియు శారీరక బాధలు వేధిస్తాయి.
క్యాన్సర్ వ్యాధి పేరు వింటేనే భావోద్వేగానికి లోనవుతారు.కొందరు క్యాన్సర్ బాధితులకు వీలైనంత వరకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.
అయితే ఈ వ్యాధి ముసుగులో ప్రజలను మోసం చేసేవారు కూడా ఉన్నారు.అలాంటి ఒక ఉదంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలో నివాసం ఉంటున్న అమండా క్రిస్టీన్ రిలే గత ఏడేళ్లుగా క్యాన్సర్ పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.
‘న్యూయార్క్ పోస్ట్‘ తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ ప్రజల నుండి 105 వేల డాలర్లు అంటే 81 లక్షల రూపాయలు విరాళంగా సేకరించింది.2012లో అమండా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసింది.తనను తాను క్యాన్సర్ పేషెంట్‌గా పేర్కొంది.
ప్రజలను విరాళాలు అడగడం ప్రారంభించింది.ఈమెకు చాలామంది ఆర్థిక సాయం కూడా చేశారు.
తన అనారోగ్యం గురించి తెలియజేసేందుకు అమండా ఒక బ్లాగును కూడా ప్రారంభించింది.దీనిలో తన కథతోపాటు క్యాన్సర్‌కు సంబంధించిన వివరాలను రాయడం ప్రారంభించింది.
అంతేకాదు ప్రజలకు తనపై నమ్మకం కలిగేందుకు గుండు కొట్టించుకుంది.దాదాపు ఏడేళ్ల తర్వాత ఆ మహిళకు సంబంధించిన అసలు నిజం బయటపడింది.
సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె నుంచి డబ్బులు తిరిగి వసూలు చేసే పనిలో పడ్డారు.