చిత్రం :
విన్నర్
బ్యానర్ :
లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
దర్శకత్వం :
గోపిచంద్ మలినేని
నిర్మాతలు :
ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి
సంగీతం :
తమన్
విడుదల తేది :
ఫిబ్రవరి 23, 2017
నటీనటులు :
సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్, జగపతి బాబు తదితరులు
కెరీర్ మొదలుపెట్టి ఎక్కువ కాలం కాలేదు కాని, ఇప్పటికే తనకంటూ ఓ మార్కేట్ ని సంపాదించుకున్నాడు సాయిధరమ్ తేజ్.పక్కా కమర్షియల్ సినిమాలు తీసే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయి నటించిన సినిమానే “విన్నర్”.
ఈమధ్య కాలంలో వీళ్ళిద్దరి ఫామ్ ఫర్వాలేదు అనిపించేలా ఉండటంతో “విన్నర్” మీద మంచి అంచనాలు ఉన్నాయి.మరి అంచనాలకి తగ్గట్టుగా విన్నర్ తీర్చిదిద్దబడిందో లేదో చూద్దాం
కథలోకి వెళితే :
రామ్ (సాయిధరమ్ తేజ్) కి హార్స్ రేస్ అంటే పడదు.అథ్లేట్ గా ఎదగాలనుకొనే సితారని (రకుల్) చూసి ప్రేమలో పడతాడు.కాని సితారకి యువ (ఠాకూర్ అనూప్ సింగ్) ని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు పెద్దలు
ఇప్పుడు రామ్ సితారిని గెలుచుకోవాలంటే యువతో గుర్రపు స్వారీ పందెంలో గెలవాలి.మరి రామ్ సితారని, ఛాలెంజ్ ని గెలుచుకోని విన్నర్ గా నిలిచాడా లేదా అనేది తెర మీదే చూడాలి.
నటీనటులు నటన :
సాయిధరమ్ లుక్ పరంగా కొత్తగా అనిపించాడు కాని, నటన పరంగా మాత్రం ఎలాంటి కొత్తదనం లేదు.ఏదో మాస్ హీరోగా స్థిరపడాలనే తాపత్రయమే తప్ప, తెర మీద ఒక నటుడిగా కనిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేవు.విన్నర్ నుంచి సాయిధరమ్ సంపాదించేది ఏమి లేదు.
అలాగే ఈ సినిమాలో ధరమ్ ని ఇష్టపడటానికి కారణాలు కూడా లేవు
రకుల్ ప్రీత్ గ్లామర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి ఉంటుంది.పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాదు.
జగపతిబాబు సరిగా వాడుకోలేదు.విలన్ పాత్ర ఇరిటేటింగ్ గా ఉంది.కామెడియన్స్ నవ్వించడానికి విశ్వయత్నాలు చేసారు.
టెక్నిషియన్స్ :
తమన్ పాటల్లో ఓ సితార ఒక్కటే మెప్పిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా, పసలేనిదిగా ఉంది.అసలే బలం లేని కథాకథనాలకు, నేపథ్య సంగీతం మరో పెద్ద మైనస్.సినిమాటోగ్రాఫి లో క్వాలిటి ఉన్న కంటెంట్ లేదు.బ్యాడ్ ఎడిటింగ్ సినిమాని మరింత బ్యాడ్ చేసింది.
విశ్లేషణ :
సాయిధరమ్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ఇది.కాని నెగెటివ్ గా.ఇలాంటి పరమ రొటీన్ సినిమాలకు స్వస్తిచెప్పకపోతే కష్టమే.పాత చింతకాయ పచ్చడి కంటెర ఘోరమైన నరేషన్, ఇప్పటివరకూ 300 సినిమాల్లో చూసినట్లుగా అనిపించే సన్నివేశాలతో, ఒక ప్రేక్షకుడిని నసపెట్టడమే ధ్యేయంగా సాగింది విన్నర్.
నటీనటులు అభినయం, రాసిన ప్రతి మాట, ప్రయత్నించిన ప్రతి ఎమోషన్ .అన్ని నకిలీగా అనిపించే, అరిగి నలిగిన మరో తెలుగు సినిమానే విన్నర్
కొత్తగా తీసుకొచ్చిన గుర్రపుస్వారీ అయినా కొంచెం ఆసక్తి పుట్టిస్తుందా అంటే అదీ లేదు.ఏదో అనసూయ ఐటమ్ సాంగ్ ని చూడాలని మాస్ ప్రేక్షకులు ఆసక్తి చూపించడమే తప్ప, మరో ఆసక్తికరమైన అంశం లేదు.
ప్లస్ పాయింట్స్ :
* అనసూయ ఐటమ్ సాంగ్ (మాస్ ప్రేక్షకులకి)
మైనస్ పాయింట్స్ :
* ఆసక్తిగా లేని కథాకథనం* నటులు, టెక్నిషియన్స్,* గోపీచంద్ మలినేని దర్శకత్వం
చివరగా :
విన్నర్ కాదు లూజర్
తెలుగుస్టాప్ రేటింగ్ :
1.5/5
.