తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కీలక నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం వివేక్ మాట్లాడుతూ తనకు టికెట్ ముఖ్యం కాదని తెలిపారు.తెలంగాణ సాధన కోసం తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణలో రాక్షస పాలనను దించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.ఈ క్రమంలోనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన అందరం కలిసికట్టుగా పని చేసి కేసీఆర్ ను గద్దె దించుతామని తెలిపారు.