ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం.అలా అని ప్రతి గొడవకి భార్యాభర్తలిద్దరూ బాధ్యులు కారు.
కొన్ని అనుకోని సంఘటనలు, తాగుడు, ఇతర సమస్యల కారణంగా గొడవలు మొదలవుతాయి. కొంతమంది భార్యలు అడ్జస్ట్ అవుతూ బతుకుతారు కొందరికి తట్టుకోలేరు.
పురాణాల్లో చెప్పుకున్నట్టు భరించే శక్తి ఒక భార్యకే ఉంటుందంటారు.నేటి సమాజంలో అంతా విరుద్ధంగా జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే.కుటుంబ కలహాలతో భర్తను భార్య హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాటికొండలో చోటుచేసుకుంది.
ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రమేష్ కు (40) నిర్మలకు పన్నెండేళ్ల కిందట వివాహమయ్యింది.
వీరికి ఇద్దరు కుమారులు.రమేష్ కు అనారోగ్యం కారణంగా ఐదు సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడేవారు.కొంతకాలంగా దంపతుల మధ్య ఘర్షణ జరుగుతుంది ఈ క్రమంలో ఈ నెల 20న మరోసారి గొడవ పడ్డారు.క్షణికావేశంలో ఆలోచించకుండా భార్య నిర్మల.భర్తపై రోకలిబండతో దాడి చేసింది.రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో అతనికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్మలను అరెస్టు చేశారు.నిర్మల తీసుకున్నా క్షణికావేశంతో జైలు పాలయ్యింది.
ఆ ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.