మహా ఇల్లాలు : భర్తను హత్య చేసి మిస్ అయ్యాడంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన భార్య...

ఈ మధ్యకాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతరులు ప్రాణాలను కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ రోజూ మద్యం సేవించి తనని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఏకంగా తన భర్తని హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నాలు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Wife Killed Her Husband For Daily Harassment, Daily Harassment, Wife Killed Her-TeluguStop.com

పూర్తి వివరాలకు వెళ్తే స్థానిక రాష్ట్రంలోని అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న వీరులపాడు గ్రామంలో “షేక్ బాజీ” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.కాగా ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికే చిన్న చిన్న పనులు మరియు వ్యాపారాలు చేసే వాడు.

ఈ క్రమంలో కొంత మేర మద్యానికి బానిసయ్యాడు.దీంతో మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య పిల్లలను చిత్ర హింసలకు గురిచేసేవాడు.ఈ మధ్యకాలంలో షేక్ బాజీ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతుండడంతో అతడి భార్య మద్యం మత్తులో ఉండగా భర్త ని హతమార్చింది.అనంతరం షేక్ బాజీ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేసింది.

ఈ క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నాలు చేసింది.కానీ షేక్ బాజీ భార్య ప్రవర్తనలో మార్పులు గమనించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.

దీంతో నిందితురాలిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.అంతేకాకుండా ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ తప్పుచేసిన వారు కచ్చితంగా పోలీసులకు పట్టుబడ్డ తారని కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.

అంతే కాకుండా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ అనుకున్న వారి జీవితాల్లో విషాదాన్ని నింపవద్దని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube